News May 11, 2024
HYD: KCRలాగానే రేవంత్ రెడ్డి ప్రమాదకారి: కిషన్ రెడ్డి

KCRలాగానే రేవంత్ రెడ్డి కూడా ప్రమాదకారి అని సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. HYDలో ఆయన ఈరోజు మాట్లాడారు. అధికారం కోసం KCR, రేవంత్ రెడ్డి ఎంతకైనా తెగిస్తారని ఆరోపించారు. అబద్ధాలు ఆడడంలో ఇద్దరు నాయకులు ఆరితేరారన్నారు. గతంలో కాంగ్రెసోళ్ల అసమర్థత వల్లే పాకిస్థాన్‌కు అడ్డుకట్ట వేయలేకపోయారని, చివరకు సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రూఫ్స్ అడిగే స్థాయికి రేవంత్ రెడ్డి దిగజారాడన్నారు.
Similar News
News February 18, 2025
HYD: GREAT..13 ఏళ్లుగా కడుపు నింపుతున్నాడు!

HYDలో ఓ వ్యక్తి ఏకంగా 13 ఏళ్లుగా పేదల కడుపు నింపుతున్నాడు. పేదల బాధను చూసిన అతడు ఆకలికి మతం లేదంటాడు. ఆయనే సామాజికవేత్త అజహర్ మాక్సూసి. చంచల్ గూడ, డబిర్‌పూర ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద కూడు, గూడులేని వారికి 4,720వ రోజు పేదలకు భోజనం పెట్టాడు. సేవ చేయడంలోనే తన సంతోషాన్ని వెతుక్కుంటున్నానని తెలిపారు. తన సేవలను అభినందిస్తూ ప్రజలు ‘Keep it Bhai’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
News February 17, 2025
నుమాయిష్ ముగింపు: మంత్రి పొన్నం బహుమతులు ప్రదానం

నాంపల్లిలో 46 రోజులు కొనసాగిన 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) సోమవారం 2025 ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు అందజేశారు. 19.72 లక్షల మంది సందర్శించిన ఈ ప్రదర్శనలో 2,000 స్టాల్స్ ఏర్పాటు కాగా, 20,000 మందికి ఉపాధి కల్పించింది. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయంతో 20 విద్యా సంస్థలు నడుస్తున్నాయి అన్ని మంత్రి తెలిపారు.
News February 17, 2025
HYDలో చెత్త బండి.. ఇదే వీరి బతుకు బండి..!

గ్రేటర్ HYDలో GHMC స్వచ్ఛ ఆటో డ్రైవర్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దుర్గంధ భరితపు వాసనను భరిస్తూ ఇబ్బందులు పడుతూ ఇంటి నుంచి చెత్త సేకరించి, నగర స్వచ్ఛతకు బాసటగా నిలుస్తారు. HYDలో ఓ స్వచ్ఛ ఆటోలో చెత్త బ్యాగులపైన బాలుడు ఉండటం వారి కష్టానికి నిదర్శనం అని పలువురు ట్వీట్లు చేస్తున్నారు. CREDIT: ఫొటో జర్నలిస్ట్ లోగనాథన్