News March 29, 2024

HYD: KCR ఫోకస్.. BRS పుంజుకుంటుందా?

image

HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల‌ BRS శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు మాజీ సీఎం KCR ఫోకస్ పెట్టారని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో BRS ఓడిపోయినా, కొందరు కీలక నేతలు పార్టీని మోసం చేసి వెళ్లినా సరే BRSను గెలిపిస్తామని ఇటీవల ఆ పార్టీ MLAలు అన్నారు. మరి KCR సభతో BRS పుంజుకుంటుందా? మీ కామెంట్?

Similar News

News January 17, 2025

HYD: చిన్నప్పటి నుంచి నుమాయిష్‌కు వచ్చేవాడిని: సీపీ

image

నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయంతో విద్యారంగ వ్యాప్తికి నిర్వాహకులు ఎంతో కృషి చేస్తున్నారని HYD సీపీ సీవీ ఆనంద్ అన్నారు. గురువారం ఇందులో పోలీస్ స్టాల్‌ను ప్రారంభించి మాట్లాడారు. తన చిన్నప్పటి నుంచి నుమాయిష్‌ను సందర్శించి కావాల్సినవి కొనుక్కుని ఉల్లాసంగా గడిపేవాడినని గుర్తుచేసుకున్నారు. ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్, డీసీపీలు,ఏసీపీలు,ఇన్ స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

News January 17, 2025

HYD: బ్రిజేష్ ట్రిబ్యునల్‌ను ప్రభుత్వం స్వాగతిస్తోంది: మంత్రి

image

బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌ను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. తెలంగాణకు సరైన న్యాయం జరిగేందుకు ఈ తీర్పు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. బచావత్ ట్రైబ్యునల్ ఎన్.బ్లాక్‌గా కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కనుందని తెలిపారు.

News January 16, 2025

RR: గంజాయి, డ్రగ్స్ డిస్పోజల్ చేయాలి: డిప్యూటీ కమిషనర్

image

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో రంగారెడ్డి డివిజన్ ఎక్సైజ్ యంత్రాంగంతో రంగారెడ్డి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రంగారెడ్డి డివిజన్ పరిధిలోని 20 ఎక్సైజ్ పీఎస్‌‌లలో చాలా కేసుల్లో పట్టుబడిన గంజాయి, డ్రగ్స్ డిస్పోజల్ చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా వాహనాల వేలాన్ని వెంటనే పూర్తి చేయాలన్నారు.