News February 6, 2025
HYD: KCR రాజీనామా చేయాలా.. వద్దా..?: (VIRAL)

GHMC కార్పొరేటర్ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి BRS తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. ‘అసెంబ్లీకి రాని, ప్రజల సమస్యలు పట్టించుకోని KCR గారు గజ్వేల్ MLAగా రాజీనామా చేయాలా..? వద్ద..?’ అని ప్రశ్నించారు. దీనిపై ఇరు పార్టీల సోషల్ యాక్టివిస్ట్‌లు స్పందించారు. నిజమే అని BJP శ్రేణులు.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏంటని BRS నేతలు పోటీ పడటం గమనార్హం.
Similar News
News April 14, 2026
CSKతో మ్యాచ్.. టాస్ గెలిచిన KKR

IPL 2026: చెన్నైతో జరగనున్న మ్యాచులో KKR టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
CSK: శాంసన్, గైక్వాడ్, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్, శివమ్ దూబే, బ్రెవిస్, ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.
KKR: రహానె, గ్రీన్, రఘువంశీ, పావెల్, రింకూ సింగ్, అనుకుల్ రాయ్, నరైన్, రమణ్‌దీప్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.
News April 14, 2026
కేటీఆర్.. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పు: టీపీసీసీ చీఫ్

ఖమ్మం: కేటీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. పదేళ్ల BRS పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని, కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. కేటీఆర్ పాదయాత్రకు సిద్ధమవ్వడంపై మండిపడుతూ.. యాత్రకు ముందు సంతోష్ రావు, హరీశ్ రావుపై సొంత చెల్లెలు కవిత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. పదవులు కోల్పోయిన ఆక్రోశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు.
News April 14, 2026
గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ బలోపేతం కావాలి: టీపీసీసీ చీఫ్

ఖమ్మం డీసీసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి, ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఈ దేశంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఖమ్మం జిల్లా.. కాంగ్రెస్‌కి ఎప్పుడూ అండగా నిలిచిందని అన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలని పిలుపునిచ్చారు.


