News October 3, 2024

HYD: KCR.. వాళ్లని కంట్రోల్ చేయ్: MP

image

HYD ప్రజల క్షేమం, భద్రత కోసమే హైడ్రా, మూసీ ఆపరేషన్లు స్టార్ట్ చేశామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. తమ ప్రభుత్వం రూ.కోట్లు కొల్లగొడుతోందని KTR, హరీశ్ రావు ఆరోపణలు అర్థరాహిత్యమని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తే HYD అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని వ్యాఖ్యానించారు. ఇష్టానుసారం మాట్లాడుతున్న KTR, హరీశ్ రావును KCR కంట్రోల్ చేయాలని, రాష్ట్ర భవిష్యత్తును వీళ్లు అడ్డుకుంటున్నారన్నారు.

Similar News

News November 8, 2024

HYD: MLA మనవరాలి టాలెంట్ చూసి KTR ఫిదా..!

image

7వ తరగతి చదువుతున్న పట్లోళ్ల అక్షయిని రెడ్డి టాలెంట్ చూసి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఫిదా అయ్యారు. చిన్న వయసులోనే ‘ట్రయల్ ఆఫ్ మిస్ ఫార్చున్’ అనే పుస్తకాన్ని రాసిన అక్షయిని రెడ్డి తన టాలెంట్ ఏంటో నిరూపించారు. అక్షయిని రెడ్డి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మనవరాలు. ఆటమ్ అనే అమ్మాయి కథే ‘ట్రయల్ ఆఫ్ మిస్ ఫార్చున్’ పుస్తకం అని వారు తెలిపారు.

News November 8, 2024

HYD: ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ ఎక్కడ?

image

HYD, RR, మేడ్చల్ జిల్లాల్లో 3,70,357 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు. అయితే పాఠశాలలపై అనునిత్యం జరగాల్సిన తనిఖీలు జరగడం లేదు. అధికారులకు నెలనెలా తనిఖీలు చేసి పరిస్థితి ఎలా ఉంది..? విద్యార్థులకు అన్ని వసతులు ఉన్నాయా..? పాఠశాలకు, పిల్లలకు ఏం అవసరం..? అనే వివరాలు రికార్డు చేయాల్సి ఉంది. కానీ.. అది జరగడం లేదంటున్నారు. దీంతో పలుచోట్ల పిల్లలే రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు.

News November 8, 2024

HYD: గల్లీకో హోటల్.. తనిఖీ చేసేవారు కొందరే..!

image

HYDలో 74 వేలకు పైగా రెస్టారెంట్లు ఉంటే.. సుమారు 23 మంది మాత్రమే ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. అంటే 3,552 రెస్టారెంట్లకు ఒక తనిఖీ అధికారి ఉన్నారు. దీన్నిబట్టి గమనిస్తే అధికారుల కొరత ఎంత ఉందో అర్థమవుతుంది. అధికారి రోజుకు 10 హోటళ్లలో తనిఖీ చేసినప్పటికీ, ఏడాదిలో అన్ని హోటళ్లు తనిఖీ చేయడం అసాధ్యమైన పనిగా కనిపిస్తోంది. వెంటనే తనిఖీ చేసే అధికారుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది.