News April 6, 2024
HYD: KCR హయాంలోనే అభివృద్ధి జరిగింది: రాగిడి

HYD నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండారి లే అవుట్లో బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. రాగిడి మాట్లాడుతూ.. KCR హయాంలోనే అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతూ ప్రజలను మభ్య పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద, నిజాంపేట్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్ పాల్గొన్నారు.
Similar News
News December 2, 2025
GHMC: దీర్ఘకాలిక సేవల కోసం HMWSSB ప్రణాళికలు

GHMCలో శివారు మున్సిపాలిటీల విలీనంతో HMWSSB పరిధి కూడా పెరగనుంది. దీంతో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ తన సేవలు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీనంతో తాగునీరు, సీవరేజ్, డ్రైనేజి లైన్ నిర్వహణ భారంగా మారనుంది. కొత్తగా లైన్ ఏర్పాటు చేయడంతో పాటు, పాతవాటికి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. 2047 వరకు ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తోంది.
News December 2, 2025
HYD: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

కోవైట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వస్తున్న ఇండిగో (6e 1234) విమానానికి బాంబు బెదిరింపు మేయిల్ వచ్చింది. అర్దరాత్రి 1:30 నిమిషాలకు బయలుదేరిన విమానం ఉదయం 8:10 శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు విమానం చేరుకుంది. బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో విమానాన్ని ముంబై ఎయిర్ పోర్ట్‌కు దారి మళ్లించారు. ముంబయిలో ఇంకా ల్యాండింగ్ కానీ విమానం భయం గుప్పెట్లో ఫైలెట్ తోపాటు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
News December 2, 2025
HYD: ప్రేమ జంట ఆత్మహత్య(UPDATE)

రంగారెడ్డి జిల్లా కొత్తూరులో <<18443763>>ప్రేమ జంట<<>> ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా, కొత్తూరు పట్టణంలో ఓ బేకరీ పరిశ్రమలో పనిచేస్తున్న అనామిక అదే కంపెనీలో బిహార్‌కు చెందిన ధనుంజయ్‌ను ప్రేమించింది. అనామిక పరిశ్రమకు వెళ్లకపోవడంతో ధనుంజయ్ ఆమెకు ఫోన్ చేసి ఇంటికి వచ్చాడు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించా


