News December 21, 2025

HYD: KCR కోసం కాంగ్రెస్ WAITING

image

అసెంబ్లీ ఎన్నికల అనంతరం దాదాపు ఫామ్ హౌస్‌కే పరిమితమైన BRS అధినేత KCR నేడు తెలంగాణ భవన్‌కు రానున్నారు. BRSLP సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉండగా కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారో అని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాక అధికార పార్టీ నాయకులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు సాధారణ ప్రజలు కూడా ఆయన గళం కోసం వెయిటింగ్.

Similar News

News December 24, 2025

HYD: 2025లో ‘550’.. గుర్తుందా?

image

NEW YEAR సెలబ్రేషన్ అంటే సిటీలో బట్టలు చింపుకోవాల్సిందే. ఏజ్‌తో సంబంధం లేకుండా చిల్ అవుతుంటారు. ఏదైనా ఒక మోతాదు వరకు అంటే ఓకే. కానీ, 2025 న్యూ ఇయర్ మీకు గుర్తుందా?. ఓ మందుబాబు పీకలదాకా తాగి పోలీసులకు చిక్కాడు. పంజాగుట్టలో బైకర్‌ను ఆపి బ్రీత్ అనలైజర్‌ టెస్ట్ చేయగా ఏకంగా 550 రీడింగ్ నమోదైంది. ఇది చూసి పోలీసులే షాకయ్యారు. న్యూ ఇయర్ రోజే మందుబాబు ఫొటో వైరలైంది. చిల్ అవ్వండి బ్రో.. చిల్లర అవ్వకండి.

News December 24, 2025

చిక్కడపల్లిలో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ అమ్మిన యువతి అరెస్ట్

image

చిక్కడపల్లిలో డ్రగ్ నెట్‌వర్క్‌ గుట్టును పోలీసులు బయటపెట్టారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుష్మిత తన బాయ్‌ఫ్రెండ్ ఇమాన్యుల్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి MDMA డ్రగ్స్, LSD బాటిల్స్, ఓజీ కుష్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుంది.

News December 24, 2025

HYD: సిటీ కుర్రాళ్ల కొత్త ట్రెండ్‌..!

image

భాగ్యనగరంలో కేఫ్‌ కల్చర్‌ సరికొత్త పుంతలు తొక్కుతోంది. కేవలం కాఫీ, కబుర్లకే పరిమితం కాకుండా ‘పికిల్‌ బాల్‌’ వంటి క్రీడలతో యువత కేఫ్‌లల్లో సందడి చేస్తోంది. ఫ్రెంచ్, ఈజిప్షియన్‌ థీమ్స్‌తో సరికొత్త లోకాలను తలపిస్తున్న ఈ ప్రాంతాలు జెన్‌-జీ కుర్రాళ్లకు అడ్డాగా మారాయి. మరోవైపు ‘DIY’ ఫ్యాషన్‌తో పాత చికంకారీ వస్త్రాలకు స్ట్రీట్‌ వేర్‌ టచ్‌ ఇచ్చి ఫ్లీ మార్కెట్లలో సందడి చేస్తున్నారు.