News January 25, 2025
HYD: KCR చేయని అభివృద్ధి రేవంత్ రెడ్డి చేశారు: ఎంపీ

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గులాబీ కళ్లజోడు తీసేసి చూడాలని, అప్పుడే అన్నీ సజావుగానే కనిపిస్తాయని MP చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ..కిషన్ రెడ్డి మోదీ క్యాబినెట్‌లో మంత్రివా లేక KCR ఫామ్ హౌస్‌లో పాలేరువా అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 10ఏళ్లలో KCR చేయలేని అభివృద్ధిని రేవంత్ రెడ్డి మొదటి ఏడాదిలోనే చేసి చూపించారని, KTRతేలేని పెట్టుబడులను తెచ్చి యువతకు ఉద్యోగాలిస్తున్నామన్నారు.
Similar News
News July 9, 2025
MBA కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

ఓయూ పరిధిలోని MBA కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్-డే), ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్) రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, ఎంబీఏ (ఈవినింగ్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్-ఈవినింగ్) నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చేనెల 5వ తేదీ నుంచి నిర్వహిస్తామన్నారు.
News July 9, 2025
ఓయూ బీఈడీ పరీక్షా ఫీజు స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. బీఈడీ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 24లోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని సూచించారు. రూ.200 లేట్ ఫీతో ఈ నెల 29వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
News July 9, 2025
ఘట్కేసర్ వాసుకి ఉత్కృష్ట సేవా పథకం

కేంద్ర ప్రభుత్వ ఉత్కృష్ట సేవా పతకం ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సీ నగర్‌కు చెందిన గుండ్యా నాయక్‌ను వరించింది. విధి నిర్వహణలో 15 ఏళ్ల పాటు సేవ, అంకితభావంతో వృత్తి పరమైన నైపుణ్యంతో అనేక విజయాలు సాధించిన ఆయనను ఉత్కృష్ట సేవా పతకం 2025 వరించింది. ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.