News October 27, 2025
HYD: KCR పాలనలో చాలా దోచుకున్నారు: BJP కార్పొరేటర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS అభ్యర్థిని గెలిపిస్తే మళ్లీ తెలంగాణని దోచుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టేనని సరూర్‌నగర్ BJP కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేసిన ఆమె మాట్లాడారు. KCR పదేళ్ల పాలనలో చాలా దోచుకున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఈసారి ఆలోచించి బీజేపీని గెలిపించాలన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు మేల్కోవాలని కోరారు. BRS పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు.
Similar News
News October 27, 2025
సంగారెడ్డి: ‘ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి’

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే పూర్తిస్థాయిలో ప్రారంభించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సివిల్ సప్లై అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. దీంతో పాటు సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా వెంటనే ప్రారంభించాలని సూచించారు.
News October 27, 2025
NRPT: అకాల వర్షాలతో పంట నష్టం జరగకుండా చూడాలి

అకాల వర్షాలతో రైతుల పంటలు నష్టం వాటిల్లకుండా చూడాలని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు కలెక్టర్లను ఆదేశించారు. హైద్రాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పత్తి, వరి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News October 27, 2025
కవిత కొత్తగా..

TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త వేషధారణలో కనిపిస్తున్నారు. జనం బాట కార్యక్రమం చేపట్టిన ఆమె గతంతో పోలిస్తే సాదాసీదా చీరలు ధరిస్తున్నారు. హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉంది. ప్రస్తుతం కవిత నిజామాబాద్ జిల్లాలో రైతులను పరామర్శిస్తున్నారు. 4 నెలల పాటు ఈ యాత్ర సాగనుంది.


