News December 21, 2025

HYD: KCR మాటల కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్

image

అసెంబ్లీ ఎన్నికల అనంతరం దాదాపు ఫామ్ హౌస్‌కే పరిమితమైన BRS అధినేత KCR నేడు తెలంగాణ భవన్‌కు రానున్నారు. BRSLP సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉండగా కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారో అని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాక అధికార పార్టీ నాయకులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు సాధారణ ప్రజలు కూడా ఆయన గళం కోసం వెయిటింగ్.

Similar News

News December 30, 2025

ఇంద్రకీలాద్రిపై నూతన సంస్కరణ

image

కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించే దిశగా ఆలయ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 500 అంతరాలయ దర్శన టికెట్ పొందిన భక్తులకు కేటాయించే ఉచిత లడ్డూ ప్రసాదాన్ని ఇకపై నేరుగా టికెట్ స్కానింగ్ పాయింట్ వద్దే పంపిణీ చేయనున్నారు. గతంలో దర్శనం తర్వాత ప్రసాదం కౌంటర్ల వద్దకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు స్కాన్ పాయింట్ వద్దే ఇవ్వడం వల్ల భక్తుల సమయం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు.

News December 30, 2025

సంక్రాంతికి టోల్‌ప్లాజాల వద్ద రద్దీ లేకుండా చర్యలు: కోమటిరెడ్డి

image

TG: టోల్ ప్లాజాల వద్ద రద్దీ లేకపోతే అసౌకర్యం ఉండదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతికి నేషనల్ హైవేలపై రద్దీ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన సమీక్షించారు. ‘CM ఈ అంశంపై సీరియస్‌గా ఉన్నారు. సంక్రాంతికి టోల్ ప్లాజాల వద్ద ఫ్రీ వే ఏర్పాటుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాస్తాను. మేడారం జాతరకు వెళ్లే లక్షలాది భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలని కోరతాను’ అని తెలిపారు.

News December 30, 2025

నెల్లూరు: వారి మధ్య విభేదాలు లేనట్టేనా ?

image

కావలిలో బీద రవిచంద్ర, కావ్య కృష్ణారెడ్డి మధ్య వైరం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే.. బీదకు TDP అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత MLA దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కావ్య బీద రవిచంద్రను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో వారి మధ్య వైర ఉందా.. లేదా..? అనేదానికి చెక్ పెడతారా..?అనేది చూడాల్సి ఉంది.