News November 13, 2024
HYD: KCR పాలనలో అవినీతిపై విచారణ జరిపించాలి: TRS
మాజీ సీఎం KCR పాలనలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం CBIతో విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సమితి(TRS) చీఫ్ నరాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. HYD బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్, కరెంట్ అగ్రిమెంట్, ల్యాండ్ ట్రాన్సఫర్మేషన్‌లో KCR రూ.వేల కోట్లు అవినీతి చేశారని ఆరోపించారు. KCR అవినీతి తెలియజేసేందుకు DEC 6 నుంచి భద్రాచలం-చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు పాదయాత్ర చేస్తామన్నారు.
Similar News
News November 14, 2024
HYD: మరో 8 నెలల్లో రైల్వే స్టేషన్ల పనులు పూర్తి..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ.1830.4 కోట్లతో 38 స్టేషన్లను అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కేవలం రాజదాని పరిధిలోనే 12 స్టేషన్లు ఉండటం గమనార్హం. మల్కాజిగిరి, బేగంపేట, యాకుత్‌పుర, ఉమ్దానగర్ రైల్వే స్టేషన్ల పనులు మరో 8 నెలల్లో పూర్తికానున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చర్లపల్లి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పూర్తయి ప్రారంభానికి సిద్ధమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
News November 14, 2024
HYD: గోల్డెన్ హవర్.. మిస్ చేయకండి!
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. సైబర్ నేరానికి గురై, డబ్బు పోగొట్టుకుంటే గంటలోపు 1930, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని HYD పోలీసులు సూచించారు. డబ్బు అకౌంట్ నుంచి మాయమైన గంట లోపు ఉండే సమయాన్ని గోల్డెన్ హవర్ అంటారని తెలిపారు. ఈ సమయంలో ఫిర్యాదు చేస్తే, డబ్బులు ఫ్రీజ్ చేసి, దర్యాప్తు చేయడానికి ఎక్కు ఆస్కారం ఉంటుందన్నారు. రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువన్నారు.
News November 14, 2024
HYDలో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు
HYD నగరంలో 3 హబ్ ఆస్పత్రులైన నిమ్స్, గాంధీ, ఉస్మానియాల్లో వాస్క్యులర్ ఆపరేషన్లు, డయాలసిస్ చేయనున్నారు. మొత్తం రాష్ట్రంలో 7 కేంద్రాల ఏర్పాటు కోసం రూ.32.7 కోట్లను వెచ్చించనున్నారు. HYDలోని ప్రధాన ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు సిద్ధమవుతున్నట్లుగా అధికారులు తెలిపారు. సెంటర్లు అందుబాటులోకి వస్తే వేలాది మందికి ప్రయోజనం చేకూరనుంది.