News January 28, 2025

HYD: KTRకు ఆవేశం ఎక్కువ.. ఆలోచన తక్కువ: మంత్రి సితక్క

image

కేటీఆర్‌కు ఆవేశ‌ం ఎక్కువ‌.. ఆలోచ‌న త‌క్కువని, ఒక్క గ్రామానికే కొత్త ప‌థ‌కాల‌ను ప‌రిమితం చేసిన‌ట్లుగా భ్రమప‌డుతున్నాడని మంత్రి సీతక్క మండిపడ్డారు. ప‌థ‌కాలు రాని గ్రామాలు రణ‌రంగంగా మారుతాయ‌న్న కేటీఆర్ వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు. ఈ సందర్భంగా నూత‌న ప‌థ‌కాల‌తో గ్రామాల్లో పండ‌గ వాతావ‌ర‌ణం క‌న్పిస్తుంటే కేటీఆర్ ఓర్వ లేక‌పోతున్నాడని విమ‌ర్శించారు.

Similar News

News February 17, 2025

వరంగల్‌లో “ది స్వయంవర్”

image

తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా ది స్వయంవర్ స్టోర్‌ను వరంగల్‌లో ప్రారంభించారు. దేశంలోని 12 రాష్ట్రాల్లోని 42 నగరాల్లో 85 బ్రాంచీలతో ప్రజలకు అందుబాటులో స్పెషల్ కలెక్షన్ అందిస్తోంది ది స్వయంవర్.వివాహాది శుభకార్యాలకు అద్భుతమైన కలెక్షన్ అందించడం స్టోర్ ప్రత్యేకత. పిల్లలు, పెద్దల కోసం పట్టు పంచెలు, దుపట్టా, పైజామా, కుర్తా మొదలైన వస్త్రాలు అందుబాటు ధరల్లో అందిస్తున్నట్టు ది స్వయంవర్ యాజమాన్యం తెలిపింది.

News February 17, 2025

‘ఛావా’ మూవీ.. 3 రోజుల్లోనే రూ.100 కోట్లు!

image

విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ మూవీ 3 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తొలి రోజు రూ.33 కోట్లు, రెండో రోజు రూ.39 కోట్లు, నిన్న మూడో రోజు రూ.45 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు దూసుకెళ్తున్నాయి.

News February 17, 2025

చేనేతల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలి: కలెక్టర్

image

చేనేత కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి అధికారులు కృషి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. చేనేత కుటుంబాల జీవన స్థితిగతులను మెరుగుపరచటానికి తీసుకోవాల్సిన చర్యల పై సంబంధిత అధికారులతో సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ముద్ర పథకం కింద చేనేత కుటుంబాలకు చేయూత అందించేందుకు రుణాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.

error: Content is protected !!