News March 29, 2024
HYD: KTRపై కేసు నమోదు

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై కేసు నమోదైంది. CM రేవంత్ రెడ్డిపై KTR అనుచిత వ్యాఖ్యలు చేశారని, అతడిపై చర్యలు తీసుకోవాలని TPCC సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌రావు, కాంగ్రెస్ నేతలు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలను KTR తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. దీనిపై IPC సెక్షన్లు 504, 505 కింద జీరో FIR నమోదు చేసి కేసును HYD బంజారాహిల్స్ PSకు బదిలీ చేశామని అక్కడి ఇన్‌స్పెక్టర్ సతీశ్ తెలిపారు.
Similar News
News April 20, 2025
HYD: కూతురికి విషం ఇచ్చి తల్లి సూసైడ్ అటెంప్ట్

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతి నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. 4 సంవత్సరాల కూతురు జేష్వికకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరినీ KPHBలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. చిన్నారి మృతి చెందగా ప్రస్తుతం తల్లికి చికిత్స అందిస్తున్నారు. అనారోగ్య సమస్యలతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
News April 20, 2025
HYD: ఫ్యాన్సీ నంబర్స్ వేలం ద్వారా భారీ ఆదాయం

ఫ్యాన్సీ నంబర్స్ వేలం ద్వారా తెలంగాణ రవాణాశాఖ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. శనివారం జరిగిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఒక్క రోజులోనే రూ.3.71 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం మొత్తం 50కు పైగా ఫ్యాన్సీ నంబర్లు వేలంలో అమ్మకమయ్యాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా 9999, 0001, 6666, 7777 వంటి నంబర్లకు విపరీతమైన డిమాండ్ ఉందని తెలిపారు.
News April 20, 2025
HYD: పీహెచ్డీ కోర్సు వర్క్ పరీక్ష తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీహెచ్డీ కోర్స్ వర్క్ (ప్రీ పీహెచ్డీ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ప్రీ పీహెచ్డీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్ సైట్‌లో చూసుకోవాలని సూచించారు.