News January 11, 2025
HYD: KTRపై మరో కేసు.. మాజీ ఛైర్మన్ ఆగ్రహం!

KTRపై మరో కేసు నమోదు కావటంపై HYD కూకట్పల్లి BRS నేత, TSTS మాజీ ఛైర్మన్ జగన్ ఆగ్రహించారు. ACB ఆఫీసు నుంచి తెలంగాణ భవన్కు 330 మీటర్లకు ర్యాలీగా వెళ్లారని KTRపై కేసు పెట్టారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు అక్కడ ర్యాలీ జరగలేదని ACB ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక, పోలీసు బలగాల నడుమ 10 నిమిషాల్లో KTR తెలంగాణ భవన్ చేరుకున్నారని తెలిపారు. KTR లక్ష్యంగా ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందన్నారు.
Similar News
News October 25, 2025
కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్పై BRS ఫిర్యాదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హీటెక్కింది. బీఆర్ఎస్ నాయకులపై సోషల్ మీడియాలో కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ దుష్ప్రచారం చేసిందని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఫేక్ పోస్టులు, తప్పుదారి పట్టించే వీడియోలు, ఎడిట్ చేసిన ఫొటోలతో తమ మీద బురద జల్లుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటువంటి ఫేక్ పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
News October 25, 2025
మంత్రి పొన్నం రాజీనామా చేయాలని AAP డిమాండ్

హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరగడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని AAP తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డా.దిడ్డి సుధాకర్ ఆరోపించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శనివారం లిబర్టీలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మృతులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.
News October 25, 2025
బాలానగర్: రఘునందన్పై శ్రీనివాస్ గౌడ్ గెలుపు

బాలానగర్లోని MTAR Technologies Ltd కంపెనీలో శనివారం యూనియన్ ఎన్నికలు జరిగాయి. కార్మికుల గుర్తింపు పొందిన భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుపై గెలుపొందారు. తనపై నమ్మకంతో గెలిపించిన కార్మికులందరికీ శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీలో కార్మికులకు ఉన్న ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.


