News April 25, 2025

HYD స్థానిక ఎమ్మెల్సీ కౌంటింగ్ నేడే

image

AP: హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ఇవాళ ఉ.8కి మొదలవనుంది. మీర్జా రియాజ్(MIM), గౌతంరావు(BJP) పోటీలో ఉన్నారు. బుధవారం జరిగిన పోలింగ్‌లో 112 మందికి గాను 88 మంది ఓటు వేశారు. 45 ఓట్లు వచ్చినవారు విజేతగా నిలుస్తారు. MIMకు సింగిల్‌గానే 50 ఓట్లు ఉండటం, INC(14) కూడా మద్దతివ్వడంతో రియాజ్ గెలుపు లాంఛనమే. ఉ.10 గంటల్లోపే ఫలితం వెలువడనుంది. BRS సభ్యులు(24) ఓటింగ్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

Similar News

News April 25, 2025

మరో మైలురాయికి చేరువైన ధోనీ

image

మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో మైలురాయి చేరనుంది. ఇవాళ SRHతో జరిగే మ్యాచుతో టీ20ల్లో 400 మ్యాచులు ఆడిన నాలుగో భారత ప్లేయర్‌గా నిలవనున్నారు. ఆయన కంటే ముందు రోహిత్ శర్మ(456), దినేశ్ కార్తీక్(412), విరాట్ కోహ్లీ(407) ఉన్నారు. ఇప్పటివరకు 399 మ్యాచుల్లో 38 సగటుతో 7,566 పరుగులు చేశారు. ఇందులో 28 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

News April 25, 2025

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లే ఉంది: డానిష్ కనేరియా

image

పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించారు. ‘టెర్రరిస్టులను స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చడం దారుణం. ఆయన వ్యాఖ్యలు నిజంగానే పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్లుగా ఉన్నాయి’ అని ఎక్స్‌లో మండిపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపైనా డానిష్ దాయాది దేశాన్ని విమర్శించారు. అతడు ప్రస్తుతం USలో నివాసముంటున్నారు.

News April 25, 2025

‘అమ్మా, నాన్నా.. నాకు బతకాలని లేదు’

image

అంటూ ఏడాది బాబు ఉన్న తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలిచివేస్తోంది. TG జగిత్యాల జిల్లాకు చెందిన ప్రసన్నలక్ష్మి(28), తిరుపతికి 2023లో వివాహమైంది. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు. ఏడాది కిందట బాబు పుట్టడంతో ప్రసన్న ఉద్యోగం మానేసింది. దీంతో భర్త, అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించారు. ఈక్రమంలోనే ఇటీవల పుట్టింటికి వచ్చిన ప్రసన్న అద్దంపై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.

error: Content is protected !!