News October 8, 2024

HYD: LRS కోసం దరఖాస్తు చేసుకోండి

image

HYD, RR, MDCL జిల్లాలో అనుమతి లేని ఇంటి స్థలాలతో పాటు, అనధికార లేఅవుట్లలోని ఇంటి స్థలాల క్రమబద్ధీకరణకు 2020 నవంబరులో అప్పటి ప్రభుత్వం LRS పేరిట దరఖాస్తులు స్వీకరించింది. మధ్యలో దరఖాస్తు ప్రక్రియ ఆగిపోయినప్పటికీ మళ్లీ ప్రస్తుతం ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. https://lrs.telangana.gov.in లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని X వేదికగా టౌన్ ప్లానింగ్ అధికారులు సూచించారు.

Similar News

News January 3, 2025

BREAKING: HYD: ఉప్పల్‌లో టీచర్‌పై కేసు నమోదు..!

image

ఓ స్కూల్‌లో పిల్లాడిని కొట్టాడని టీచర్‌పై తల్లిదండ్రులు కేసు పెట్టిన ఘటన ఉప్పల్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రామంతాపూర్ గణేశ్‌నగర్‌లోని కాకతీయ హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న 13ఏళ్ల బబ్లూ దాస్ జామెట్రీ బాక్స్ తేలేదని, హోంవర్క్ చేయలేదని మ్యాథ్స్ సబ్జెక్టు టీచర్ ఘనశ్యామ్ విద్యార్థి భుజంపై కొట్టాడని తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

News January 3, 2025

HYD: భారత జాగృతి ఆధ్వర్యంలో నేడు బీసీ సంఘాల సభ

image

భారత జాగృతి ఆధ్వర్యంలో నేడు HYDలో బీసీ సంఘాల సభ జరగనుంది. ఉదయం 11 నుంచి సా.4 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద BRS MLC కవిత సభను నిర్వహించనున్నారు. సభకు నిన్ననే పోలీస్ శాఖ అనుమతి ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సభ నిర్వహించనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సభలో ప్రధానంగా డిమాండ్‌ చేయనున్నారు.

News January 3, 2025

HYD: నిలోఫర్ ఆసుపత్రిలో మరో వెయ్యి పడకలు: రవికుమార్ 

image

HYD నిలోఫర్ ఆసుపత్రిలో మరో వెయ్యి పడకల పెంపునకు చర్యలు చేపడుతున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రవికుమార్ చెప్పారు. నీలోఫర్ ఆసుపత్రికి తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర దేశాల నుంచి రోగులు వస్తున్నారని అందుకు తగ్గట్టుగా పడకలు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు 1,300 బెడ్లు ఉండగా కొత్త మరో వెయ్యి పడకలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.