News February 23, 2026

HYD: MCHRD.. CM క్యాంప్ ఆఫీస్ కాబోతుందా..?

image

HYDలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(MCRHRD)లో VVIP గెస్ట్ హౌస్ రూపురేఖలు మారబోతున్నాయి. అతిథుల భద్రతే లక్ష్యంగా దాదాపు రూ.9 కోట్లతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంపౌండ్ వాల్‌కు కాన్సర్టినా వైర్ ఫెన్సింగ్, అత్యాధునిక వాచ్ టవర్లు, పటిష్ఠమైన గేట్లతో పాటు పరిసరాల్లో సిమెంట్ రోడ్లు నిర్మించనున్నారు. దీనిని CM క్యాంప్ ఆఫీస్‌గా వాడనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Similar News

News February 25, 2026

నేడు KTR రాక.. నాగర్‌కర్నూల్‌లో హైటెన్షన్

image

కుమ్మెర కులోన్మాద ఘటనలో 8 మంది నిందితుల్లో ముగ్గురినే అరెస్ట్ చేశారని, మిగతా వారిని కూడా అరెస్ట్ చేయాలని BRS నేతలు డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన ముగ్గురిని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టాలన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈరోజు మ.12 గంటలకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నాగర్‌కర్నూల్‌కు రానున్నారు. భారీగా పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల నేతలు తరలిరావాలని పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

News February 25, 2026

GNT: రాజధాని పనుల్లో గడువు టెన్షన్.. మళ్లీ కొత్త బాధ్యతలెలా?

image

రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం రూ.1,000 కోట్లతో చేపట్టబోయే మౌలిక వసతుల పనులు రైతుల ప్లాట్లు అభివృద్ధి చేస్తున్న నిర్మాణ సంస్థలకు అప్పగిస్తున్నట్లు మంత్రి నారాయణ పలు గ్రామ సభలో చెప్పారు. అయితే రాజధాని నిర్మాణం నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థల అవస్థలు పడుతుంటే అదనంగా మౌలిక వసతులు కల్పనకు అప్పగించడం సముచితంగా లేదని పలువురు అంటున్నారు. ఇతర వ్యక్తులకు అప్పజెప్పితే బాగుంటుందన్నారు.

News February 25, 2026

మేడ్చల్: ఎగ్జామ్‌కు READY అయ్యారా?

image

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మొత్తం 151 పరీక్షా కేంద్రాల్లో ఫస్ట్ ఇయర్‌లో G- 64,780, VOC- 1,368, సెకండ్ ఇయర్‌లో G-67,792, VOC- 1,258 మంది పరీక్షలు రాయనున్నారు. మొత్తం 1,35,198 మంది పరీక్ష రాయనున్నారు. మాస్ కాపీయింగ్‌ జరగకుండా అలర్ట్ ఇచ్చే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంది. హాల్ టికెట్, పెన్నులు మర్చిపోకండి. ప్రశాంతంగా ఉండండి.
ALL THE BEST