News November 8, 2024
HYD: MLA మనవరాలి టాలెంట్ చూసి KTR ఫిదా..!
7వ తరగతి చదువుతున్న పట్లోళ్ల అక్షయిని రెడ్డి టాలెంట్ చూసి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఫిదా అయ్యారు. చిన్న వయసులోనే ‘ట్రయల్ ఆఫ్ మిస్ ఫార్చున్’ అనే పుస్తకాన్ని రాసిన అక్షయిని రెడ్డి తన టాలెంట్ ఏంటో నిరూపించారు. అక్షయిని రెడ్డి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మనవరాలు. ఆటమ్ అనే అమ్మాయి కథే ‘ట్రయల్ ఆఫ్ మిస్ ఫార్చున్’ పుస్తకం అని వారు తెలిపారు.
Similar News
News December 13, 2024
HYD: KTR వద్దకు సివిల్ ఇంజినీర్లు..!
HYDలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR వద్దకు వెళ్లిన సివిల్ ఇంజినీర్లు, డిప్యూటీ సర్వేయర్ల నియామకంలో జరగబోయే అన్యాయాన్ని వివరించారు. ఎలాంటి క్వాలిఫికేషన్‌లేని వీఆర్వోలను డిప్యూటీ సర్వేయర్లుగా కేటాయిస్తే చరిత్రలోనే పెద్ద తప్పుగా మిగులుతుందని అభ్యర్థులు వాపోయారు. అభ్యర్థుల పక్షాన పోరాడుతానని KTR సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఇందులో సర్వేయర్లు, గతంలో పరీక్ష రాసిన వారు పాల్గొన్నారు.
News December 13, 2024
HYD: సోలార్ పవర్‌తో నడిచే యంత్ర తయారీకి గ్రీన్ సిగ్నల్
HYDలోని పటాన్‌చెరు వద్ద ఉన్న ఇక్రిశాట్ సౌరశక్తితో నడిచే గుర్రపు డెక్క తొలగించే హార్వెస్టర్ కోసం భారతదేశంలోనే మొదటి పారిశ్రామిక డిజైన్ గ్రాంట్ పొందింది. HYD వ్యాప్తంగా చెరువులలో ఉన్న గుర్రపు డెక్క మొక్కను తొలగించటం కోసం ప్రస్తుతం డీజిల్ ఇంధనం ద్వారా నడిచే యంత్రాలను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. సోలార్ పవర్ హార్వెస్టర్ అందుబాటులోకి వస్తే లాభం చేకూరనుంది.
News December 13, 2024
HYD: బన్నీ ARREST… ఎప్పుడేం జరిగిందంటే..?
>ఉ.11.45కు – జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన పోలీసులు >మ.12.00- సంధ్య థియేటర్ ఘటన కేసులో అరెస్టు చేస్తున్నామని చెప్పిన పోలీసులు > మ.12.15- నివాసం నుంచి చిక్కడపల్లి PSకు తరలింపు >మ.1- బన్నీతో PSకు చేరుకున్న పోలీసులు > మ.2.10 – వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలింపు >మ.2.50 – గాంధీలో ముగిసిన వైద్య పరీక్షలు.. నాంపల్లి కోర్టుకు తరలింపు >3.20కు కోర్టుకు రాక >సా.4 గంటలకు విచారణ