News April 9, 2025

HYD: MMTS మహిళా బోగీల్లో సీసీ కెమెరాలు

image

HYDలోని నాలుగైదు MMTS ట్రెన్లలోనే సీసీ కెమెరాలు ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మహిళల భద్రత కోసం త్వరలో అన్ని MMTS ట్రెయిన్లలోని మహిళా బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే MMTS స్టేషన్లలో కూడా కెమెరాల ఏర్పాటుపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు పరిశీలిస్తున్నారు.

Similar News

News July 9, 2025

HYD: మహిళలు.. ఈ నంబర్‌ సేవ్ చేసుకోండి

image

మహిళలకు అండగా రాచకొండ షీ టీమ్స్ ఉంటుందని సీపీ సుధీర్‌బాబు తెలిపారు. గత 15 రోజుల్లో 185 మంది పొకిరీలను షీ టీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 215 ఫిర్యాదుల్లో 9 క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. మెట్రో, బస్టాండ్లలో షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లను నిర్వహిస్తోందని, మహిళలు వేధింపులకు గురైతే రాచకొండ వాట్సప్ నంబర్ 8712662111కు ఫిర్యాదు చేయాలన్నారు.

News July 9, 2025

ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీం ఎత్తివేసే కుట్ర: ఆర్.కృష్ణయ్య

image

కాలేజ్ విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీంను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. ప్రభుత్వ కుట్రలో భాగంగా ట్రస్ట్ బ్యాంక్ నిధి అనే సరికొత్త ప్రతిపాదన కాలేజీ యాజమాన్యాల ద్వారా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు.

News July 8, 2025

HYD: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఓయూ వీసీ

image

TG హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం కలిశారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో బాబాసాహెబ్ డా.BR అంబేడ్కర్ పాత్ర అనే అంశంపై ఈనెల 12న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో భారత ప్రధాన న్యాయమూర్తి ప్రసంగించనున్నారు. దీంతో హైకోర్టు ప్రాంగణంలో కలసి ఆహ్వానించారు. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి ఉన్నారు.