News April 15, 2024
HYD: MMTS+RTC బస్ పాస్ రూ.1,350

సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, ఫలక్ నుమా కారిడార్లలో ప్రస్తుతం రోజుకు 76 MMTS రైళ్లు నడుస్తన్నాయి. వాటిలో గరిష్ఠంగా 45 వేల మంది రాకపోకలు సాగిస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. MMTS రైళ్లు దిగిన తర్వాత ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సుల్లో వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులకు అనుసంధానంగా MMTS, బస్ పాస్ రూ.1,350 అందుబాటులోకి తెచ్చారు. తద్వారా గ్రేటర్‌లో రోజుకు సుమారు 8 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు.
Similar News
News September 11, 2025
HYD: APలో తీగ లాగితే TGలో డొంక కదలింది

గొర్రెల స్కాంలో ఈడీ వేగం పెంచింది. బాధితులు ఈ నెల 15న ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. గొర్రెల స్కామ్‌లో మోసపోయామని ఏపీ గొర్రెలకాపరులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఏసీబీ విచారణ ఆధారంగా ఈడీ ఎంటర్ అయ్యింది. ఏపీకి చెందిన గొర్రెల కాపరులకు బ్రోకర్లు రూ.2కోట్లు ఎగవేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడ తీగలాగితే TGలో డొంక కదిలింది.
News September 11, 2025
నిమ్స్‌లో వాట్సప్‌లోనే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

రోజురోజుకూ పేషెంట్లు రద్దీ పెరుగుతుండటంతో రోగులు ఇబ్బంది పడకుండా మెరుగైన సేవలు కల్పించేందుకు నిమ్స్ అధికారులు సిద్ధమయ్యారు. రిజిస్ట్రేషన్ వద్ద గంటల తరబడి వేచి చూడకుండా ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి రానుంది. మరో వారం, పది రోజుల్లో వాట్సప్, ఆన్‌లైన్ బుకింగ్ సేవలను ప్రారంభించి రోగులు వేచి ఉండకుండా చర్యలు తీసుకుంటామని నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. కియోస్క్‌లు కూడా ఉపయోగిస్తారని తెలిపారు.
News September 11, 2025
రేపటి నుంచే పరీక్షలు.. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి

పార్ట్ టైం PhD ప్రవేశ పరీక్షలు JNTUHలో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు (14వ తేదీ వరకు) ఈ పరీక్షలు ఉంటాయి. కంప్యూటర్ ఆధారంగా ఈ టెస్టులు నిర్వహించనున్నారు. దాదాపు 995 మంది ఎంట్రన్స్ టెస్టుకు హాజరవుతారని అధికారులు తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అడ్మిషన్స్ డైరెక్టర్ బాలు నాయక్ తెలిపారు.