News January 2, 2025

HYD: MNJ ఆస్పత్రికి రోగుల తాకిడి

image

రెడ్ హిల్స్‌లోని MNJ క్యాన్సర్ ఆస్పత్రికి రోజురోజుకు రోగుల తాకిడి పెరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రతి ఏటా సుమారు 1500 రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, మరో 1200 వరకు గర్భాశయ క్యాన్సర్ వచ్చిన వారు సంప్రదిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఎక్కువమంది వ్యాధి ముదిరే దశలో వస్తున్నారని, మొదటి దశలో వస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు.

Similar News

News January 26, 2025

HYD: చిల్లర ప్రచారాన్ని మానుకోవాలి: దాసోజు శ్రవణ్

image

దావోస్‌లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను చూసి తమ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు కడుపు మంట అని కాంగ్రెస్ నాయకులు హోర్డింగ్‌లను ఏర్పాటు చేయడం చిల్లర పనులని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. HYDలో హోర్డింగ్ లను ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ఈ తరహా చిల్లర ప్రచారాన్ని మానుకోవాలన్నారు.

News January 26, 2025

త్రివర్ణ శోభతో జంట నగరాలు

image

గణతంత్ర దినోత్సవం రైల్వే స్టేషన్‌లకు కొత్త శోభను తెచ్చిపెట్టింది. నిన్న సికింద్రాబాద్ రైల్ నిలయం, సికింద్రాబాద్ సౌత్ సెంటర్ రైల్వే స్టేషన్‌లను 3 రంగుల జాతీయ జెండా రంగుల విద్యుత్ దీపాలతో చూడ ముచ్చటగా అలంకరించారు. అలాగే నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేష త్రివర్ణ శోభతో జిగేల్ మంటున్నాయి. ఈ అలంకరణ ప్రయాణికులను ఆకట్టుకుంది.

News January 26, 2025

కాలీ మాత మందిరం వార్షికోత్సవంలో గవర్నర్

image

HYD బెంగాలీ స్వర్ణ శిల్పి వివేకానంద కాలీ మాత మందిరం ఐదో వార్షికోత్సవం శంషాబాద్‌లో ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. గవర్నర్ మందిరంలో కాలి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిరం కమిటీ ప్రతినిధులు ఆయనకు మెమోంటోను ప్రదానం చేశారు.