News November 16, 2024
HYD: MNJ డాక్టర్ కీలక సూచన

HYD ప్రజలకు MNJ ఆసుపత్రి డాక్టర్ శ్రీనివాస్ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు సూచనలు చేశారు. అధిక శాతంగా ఉప్పు, పదేపదే వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్ తీసుకోవడం, పొగ, మద్యం గుట్కా, కైనిమసాలా, పాన్ నమలటం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. బరువు నియంత్రణలో పెట్టుకోవాలని, రెడ్ మీట్ బదులుగా చికెన్, చేపలు, గుడ్లు తీసుకోవడం మంచిదని సూచించారు.
Similar News
News November 18, 2025
ఆరుట్ల బుగ్గ జాతర 40 వేల మంది భక్తులు

కార్తీక చివరి సోమవారం భక్తులు ఆరుట్ల బుగ్గ జాతరకు పోటెత్తారు. మహిళలు భారీ సంఖ్యలో సత్యనారాయణ వ్రతాలు ఆచరించేందుకు మక్కువ చూపారు. నీళ్లలో దీపాలను వెలిగించి శివయ్యను కొలిచారు. దాదాపు సోమవారం ఒక్కరోజే 40 వేల మంది భక్తలు ఆలయానికి వచ్చినట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ గురువారం చివరి రోజు కావడంతో ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. బుగ్గ జాతరకు మీరూ వెళ్తున్నారా?

HYD: మీ బండిలో ఇంజిన్ ఆయిల్ పోయిస్తున్నారా?

HYDలో నకిలీ ఇంజిన్ ఆయిల్ దందా రోజురోజుకూ పెరుగుతోంది. ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో కొందరి బండి ఇంజిన్ త్వరగా వేడెక్కుతోందని, పొగవస్తోందని ఆరా తీయగా గుట్టు బయటపడింది. ఈ ఆయిల్‌తో బండి త్వరగా బోర్‌కు వస్తుందని, క్లచ్‌లో తేడా గమనిస్తే మెకానిక్‌ను సంప్రదించాలని నిపుణుల చెబుతున్నారు. నమ్మకమైన చోట బండి సర్విసింగ్‌కు ఇవ్వాలని, ఆయిల్ కొనాలని సూచించారు. తేడావస్తే ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు పేర్కొన్నారు.