News May 24, 2024
HYD: MNJ దవాఖానలో 100 రోబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి

HYD లక్డీకపూల్‌లోని ఎంఎన్‌జే ప్రభుత్వ దవాఖానలో పైసా ఖర్చు లేకుండా పేద రోగులకు ఖరీదైన రోబోటిక్ శస్త్రచికిత్సలు చేస్తున్నామని ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. దవాఖానలో 100 రోబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఎన్‌జేలో గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి రోబోటిక్ సర్జరీలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.
Similar News
News February 9, 2025
హైదరాబాద్ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం జరిగింది. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జికి సంబంధించి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. 90 రోజుల్లో బ్రిడ్జి డీపీఆర్ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి పరిసరాలను రూపొందించాలని సీఎం అన్నారు. రోడ్ల వెడల్పుపైనా పలు సూచనలు చేశారు.
News February 8, 2025
అబిడ్స్ DIపై భార్య ఫిర్యాదు

అబిడ్స్ పోలీస్ స్టేషన్ డీఐ నరసింహపై ఆయన భార్య సంధ్య హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పెళ్లై 12 ఏళ్లు అవుతుందని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, అదనపు కట్నం ఇవ్వకపోతే రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
News February 8, 2025
HYD: ఢిల్లీలో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలింది: హరీశ్‌రావు

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ రెడ్డిల పాత్ర అమోఘం అన్నారు. ఇక్కడ హామీలు అమలు చేయకుండా, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రాన ఓట్లు పడతాయా? అని ప్రశ్నించారు. మీ గ్యారెంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైందని విమర్శించారు.