News March 16, 2024
HYD: ఎంపీ ఎన్నికలు.. పార్టీల సర్వేలు

ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల నాడి తెలుసుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో సర్వేలు కొనసాగిస్తున్నాయి. HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పరిధిలో ఈ ప్రయత్నాలు జోరుగా సాగుతూ ఉండటం గమనార్హం. IVR కాల్స్ ద్వారా ఓటర్ల మద్దతు తెలుసుకునేందుకు పలువురు సర్వే పనిలో పడ్డారు. వారం రోజుల నుంచి వాయిస్ కాల్స్ కూడా పెద్దఎత్తున వస్తున్నాయని ఓటర్లు చెబుతున్నారు.
Similar News
News August 23, 2025
HYD: లింక్ క్లిక్ చేస్తే ఎకౌంటు హ్యాక్.. జాగ్రత్త.!: డైరెక్టర్

క్రెడిట్, డెబిట్ కార్డుల రివార్డు పాయింట్స్ పేరిట యాక్సిస్ బ్యాంక్, ఎస్పీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి బ్యాంకుల పేర్లతో ఏపీకే ఫైల్స్, నకిలీ వెబ్సైట్ లింకులు పంపించి సైబర్ మోసాలకు పాల్పడి వేల రూపాయలు కొల్లగొట్టినట్లు ఫిర్యాదులు వచ్చినట్లు HYD CSB డైరెక్టర్ IPS షికా గోయల్ తెలిపారు. లింకులు క్లిక్ చేసిన తర్వాత అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారన్నారు. ఏవైనా మెసేజెస్, లింకులపై బ్యాంకులను సంప్రదించాలన్నారు.
News August 23, 2025
HYD: ఉర్దూ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్

HYD మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నిర్వహించే కోర్సుల దరఖాస్తు గడువు సెప్టెంబర్ 17 వరకు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. 2025- 26 విద్యా సంవత్సరానికి డిస్టెన్స్ లర్నింగ్ అండర్ UG, PG, డిప్లమా సర్టిఫికెట్ కోర్సులకు కూడా అడ్మిషన్లు అక్టోబర్ 13 వరకు అందుబాటులో ఉంటాయన్నారు.
News August 23, 2025
HYD: ఈ ప్రాంతాల్లో HMDA ఓపెన్ ప్లాట్ల విక్రయం.!

HMDA త్వరలోనే తుర్కయంజాల, బాచుపల్లి ప్రాంతాల్లో 82 ప్లాట్లను విక్రయించేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. ఆ తర్వాత మిగతా స్థలాలు అమ్మనున్నారు. బాచుపల్లి పరిధిలో 70ప్లాట్లు, తుర్కయంజాల పరిధిలో 12 ప్లాట్లు ఉన్నాయి. దశలవారీగా బైరామల్గూడ, కోకాపేట, చందానగర్, బాచుపల్లి, బౌరంపేట, చెంగిచెర్ల, సూరారం, పూప్పాలగూడ ప్రాంతాల్లోని ప్లాట్లను సైతం HMDA విక్రయించనుంది.