News January 29, 2025
HYD: MURDERకు గురుమూర్తి వాడిన 16 వస్తువులు!

మాధవి హత్య కేసులో భర్త గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మర్డర్కు ఉపయోగించిన 16 వస్తువులను సీజ్ చేశారు.
1.స్టవ్, 2.కత్తి, 3.రోలర్, 4.రోలర్ స్టోన్, 5.బకెట్, 6.వాటర్ హీటర్, 7.క్లాత్స్ (చుడీదార్ & లెగ్గింగ్), 8. నిందితుడి Short, 9.ఫినాయిల్ బాటిల్, 10.రూమ్ ఫ్రెష్నర్, 11.సర్ఫ్ ప్యాకెట్, 12.యాసిడ్ బాటిల్, 13.డోర్ మ్యాట్, 14.చెత్త బాకెట్, 15.మోటర్ సైకిల్ 16. 2 మొబైల్ ఫోన్లు పోలీసులు సీజ్ చేశారు.
Similar News
News November 19, 2025
ఇలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి ఉండదట

మాసిన బట్టలు ధరించి, పరిశుభ్రత పాటించనివారి దగ్గర లక్ష్మీదేవి ఉండదని పండితులు చెబుతున్నారు. అలాగే అమితంగా తినేవారి దగ్గర, బద్ధకంగా ఉండే వ్యక్తులు దగ్గర, కర్ణ కఠోరంగా మాట్లాడేవారి దగ్గర ధనం నిలవదని అంటున్నారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పడుకునేవారు ఎంతటి గొప్పవారైనా వారిని లక్ష్మీదేవి అనుగ్రహించదని తెలుపుతున్నారు. ఒకవేళ వీరి వద్ద సంపద ఉన్నా, అది ఎక్కువ రోజులు నిలవదని పేర్కొంటున్నారు.
News November 19, 2025
భారత్, బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా

భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య డిసెంబర్లో జరగాల్సిన సిరీస్ను బీసీసీఐ వాయిదా వేసింది. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లాతో సిరీస్కు తమకు పర్మిషన్ రాలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. డిసెంబర్లో ప్రత్యామ్నాయ సిరీస్కు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించాయి. కాగా షెడ్యూల్లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది.
News November 19, 2025
ఈనెల 23న రాప్తాడుకు వైఎస్ జగన్

ఈనెల 23న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడుకు రానున్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడి కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ స్థలాన్ని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు మాజీ సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాంతో కలిసి పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు గురించి చర్చించారు.


