News January 1, 2026
HYD: NEW YEAR వాట్సాప్ విషెస్ వచ్చాయా?

HAPPY NEW YEAR అని వాట్సాప్‌లో ఫొటో వచ్చిందా? జాగ్రత్త. ఈ ఫొటోలో బైనరీ కోడ్ ఉండొచ్చు. దాన్ని డౌన్‌లోడ్ చేస్తే మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అయ్యి పర్సనల్ డేటా అంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పోతుంది. దీన్నే డిజిటల్ స్టినోగ్రఫీ స్కామ్ అంటారని నగర పోలీసులు చెబుతున్నారు. OTPలు, బ్యాంక్ వివరాలు అన్నీ వాళ్ల ఆధీనంలోకి వెళ్తాయి. కొత్త నంబర్ల నుంచి వాట్సాప్ మెసేజ్ వస్తే అస్సలు డౌన్‌లోడ్ చేయొద్దని హెచ్చరించారు.
Similar News
News January 4, 2026
బీర్కూర్: వెల్లుల్లి నూనె తాగి వ్యక్తి ఆత్మహత్య

బీర్కూర్ మండలం వీరాపూర్‌కు చెందిన మచ్చర్ ప్రహ్లాద్(34) శనివారం ఉదయం వెల్లుల్లి రసం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతన్ని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్ నిజామాబాద్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. చికిత్స పొందుతూ రాత్రి 8 గంటల సమయంలో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య సౌందర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News January 4, 2026
విజయ్ ‘జన నాయకుడు’ రిలీజ్‌కు అడ్డంకులు!

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయకుడు’ మూవీ జనవరి 9న రిలీజ్ అవుతుందంటూ మేకర్స్ ప్రకటించినా ఇప్పటివరకూ సెన్సార్ సర్టిఫికెట్ రాలేదని తెలుస్తోంది. “సెన్సార్ బోర్డు కొన్ని రోజుల క్రితం U/A సర్టిఫికెట్‌ను సిఫార్సు చేసింది. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు” అని TVK డిప్యూటీ జనరల్ సెక్రటరీ CTR నిర్మల్ కుమార్ అన్నారు. సినిమాను ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అడ్డంకులను అధిగమిస్తామని తెలిపారు.
News January 4, 2026
ఏలూరు జిల్లా ప్రజలకు గమనిక

ఏలూరు కలెక్టరేట్, మండలం, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. ప్రజలు https://meekosam. ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని చెప్పారు. వాటి స్థితిని 1100 నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.


