News December 31, 2025

HYD: New Year.. 9490616555 కాల్ చేయండి

image

న్యూ ఇయర్ సంబరాల్లో సామాన్యులను ఇబ్బంది పెట్టే క్యాబ్, ఆటో డ్రైవర్ల ఆటకట్టించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. రైడ్ నిరాకరణ, అదనపు వసూళ్లపై ఫిర్యాదులు వస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనం నంబరు, సమయం తదితర ఆధారాలతో 9490616555 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News December 31, 2025

నాగర్‌కర్నూల్‌లో తగ్గిన చలి తీవ్రత

image

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గత కొన్ని రోజులుగా వణికిస్తున్న చలి తీవ్రత బుధవారం కాస్త తగ్గింది. గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. అమ్రాబాద్‌, కల్వకుర్తిలో అత్యల్పంగా 12.4 డిగ్రీలు నమోదు కాగా, బిజినపల్లిలో 12.6, నాగర్‌కర్నూల్‌లో 13.5, తాడూరులో 13.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం పెరగడంతో చలి ప్రభావం స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలిపారు.

News December 31, 2025

ఇక పోలవరం జిల్లా.. నేటి నుండే పరిపాలన షురూ!

image

గోదావరి జిల్లాలో కొనసాగిన పోలవరం ఇకపై జిల్లాగా రూపుదిద్దుకుంది. నేటి నుంచి పోలవరం జిల్లాలో పరిపాలన కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగిస్తున్నారు. పోలవరం జిల్లాకు ఏఎస్ దినేష్ కుమార్‌ను ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా, తిరుమణి శ్రీపూజను ఇన్‌ఛార్జ్ జేసీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

News December 31, 2025

అయామ్ సెమనీ కోడికి ఎందుకు అంత ధర?

image

అయామ్ సెమనీ కోడి ఇండోనేషియాలోని జావా ద్వీపంలో కనిపిస్తుంది. ఈ కోడి చర్మం, మాంసం, ఎముకలు, అవయవాలు, ఈకలు అన్నీ నలుపే. రక్తం ముదురు ఎరుపుగా ఉంటుంది. గుడ్లు మాత్రం బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. వాతావరణ పరిస్థితులు, జన్యు మార్పుల వల్ల సెమనీ కోళ్లకు ఈ రంగు వచ్చింది. ఇండోనేషియా ప్రజలు ఈ కోడిని పవిత్రమైనదిగా, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నదిగా నమ్ముతారు. ఈ సెంటిమెంట్ వల్లే ఈ కోడి ధర కిలో రూ.2 లక్షలకు పైనే ఉంటుంది.