News September 23, 2024

HYD: NIMSలో జెనెటిక్స్ రోగులకు డే కేర్ సేవలు

image

HYD నగరంలో పంజాగుట్ట NIMSలో జెనెటిక్స్ రోగులకు డే కేర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉప్పల్‌లోని CDFD సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి డాక్టర్ బీరప్ప తెలిపారు. ఇటీవల గర్భస్థ శిశువుల్లో వచ్చే గుండె, ఊపిరితిత్తుల వైఫల్యానికి కారణమయ్యే జన్యు లోపాలను పరిష్కరించే మార్గాన్ని వైద్యులు గుర్తించారు. ఈ మేరకు జెనెటిక్ రోగాలకు వైద్యం అందించనున్నట్లు తెలిపారు.

Similar News

News October 9, 2024

RR: జనాభా ఆధారంగా పంచాయతీలకు నిధులు

image

RR, MDCL, VKB జిల్లాలలో గ్రామ పంచాయతీలకు ఇటీవలే నిధులు విడుదల చేశారు. 3 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 వేలు, 3వేల నుంచి 8వేల జనాభా ఉన్న పంచాయతీలకు రూ.75 వేలు, 8వేలకు పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన కేటాయింపులు జరిగినట్లు తెలిపారు.

News October 9, 2024

బతుకమ్మ: రేపు దద్దరిల్లనున్న హైదరాబాద్!

image

సద్దుల బతుకమ్మ వేడుకలకు రాజధాని ముస్తాబైంది. ఎల్బీస్టేడియం, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌ అంతటా రేపు రాత్రి సందడే సందడి. వేలాది మంది ఆడపడుచులు అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను చేసి ట్యాంక్‌బండ్‌‌కు తీసుకొస్తారు. హుస్సేన్‌సాగర్‌తో పాటు బాగ్‌లింగంపల్లి, KPHB, సరూర్‌నగర్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్‌లోని GHMC మైదానాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు బతుకమ్మ పాటలతో హైదరాబాద్‌ హోరెత్తనుంది.

News October 8, 2024

HYDRAపై రేపు MLA KVR ప్రెస్‌మీట్

image

HYD సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో రేపు మ.12 గంటలకు కామారెడ్డి BJP MLA కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ‘హైడ్రా’ పనితీరు గురించి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటికే హైడ్రా పనితీరును కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. మరి KVR ఏం చెబుతారో ఉత్కంఠ నెలకొంది.