News April 24, 2024

HYD: NIMSలో రోబో సహాయంతో ట్రీట్మెంట్

image

పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో రోబో సహాయంతో ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోబో చికిత్సల కోసం రూ.2-6 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ, నిమ్స్ ఆసుపత్రిలో 40 శాతం తక్కువకే ఈ సేవలు అందిస్తున్నారు. ఇక ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SHARE IT

Similar News

News January 26, 2025

HYD: చిల్లర ప్రచారాన్ని మానుకోవాలి: దాసోజు శ్రవణ్

image

దావోస్‌లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను చూసి తమ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు కడుపు మంట అని కాంగ్రెస్ నాయకులు హోర్డింగ్‌లను ఏర్పాటు చేయడం చిల్లర పనులని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. HYDలో హోర్డింగ్ లను ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ఈ తరహా చిల్లర ప్రచారాన్ని మానుకోవాలన్నారు.

News January 26, 2025

త్రివర్ణ శోభతో జంట నగరాలు

image

గణతంత్ర దినోత్సవం రైల్వే స్టేషన్‌లకు కొత్త శోభను తెచ్చిపెట్టింది. నిన్న సికింద్రాబాద్ రైల్ నిలయం, సికింద్రాబాద్ సౌత్ సెంటర్ రైల్వే స్టేషన్‌లను 3 రంగుల జాతీయ జెండా రంగుల విద్యుత్ దీపాలతో చూడ ముచ్చటగా అలంకరించారు. అలాగే నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేష త్రివర్ణ శోభతో జిగేల్ మంటున్నాయి. ఈ అలంకరణ ప్రయాణికులను ఆకట్టుకుంది.

News January 26, 2025

కాలీ మాత మందిరం వార్షికోత్సవంలో గవర్నర్

image

HYD బెంగాలీ స్వర్ణ శిల్పి వివేకానంద కాలీ మాత మందిరం ఐదో వార్షికోత్సవం శంషాబాద్‌లో ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. గవర్నర్ మందిరంలో కాలి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిరం కమిటీ ప్రతినిధులు ఆయనకు మెమోంటోను ప్రదానం చేశారు.