News July 7, 2025

HYD: NIMS ఆసుపత్రిలో OP తీసుకోవడం ఇక చాలా ఈజీ.!

image

HYD పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో OP తీసుకోవాలంటే గంటల తరబడి క్యూ లైన్‌లో వేచి ఉండే పరిస్థితి గతంలో ఉండేది.
ఇప్పుడు ఆ పరిస్థితికి అధికారులు చెక్ పెట్టారు. ఆసుపత్రిలో కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేసి OP రిజిస్ట్రేషన్ పూర్తి చేసి స్లిప్పు అందించే ఏర్పాటు చేశారు. ఈ యంత్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే స్లిప్పు వచ్చేస్తుంది. దీంతో సేవలు చాలా ఈజీగా అవుతాయని అధికారులు తెలిపారు.

Similar News

News July 7, 2025

రేపు పలు జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. గుంటూరు, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఆస్కారం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో చిన్నపాటి జల్లులు పడేందుకు ఛాన్స్ ఉందని వివరించింది. ఇవాళ పలు జిల్లాల్లో వర్షం కురిసింది. మీ ప్రాంతంలో వాన పడిందా? కామెంట్ చేయండి.

News July 7, 2025

తిరుపతి: సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానంపై ఆసక్తి..!

image

డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు మార్గం సుగమం అయ్యింది. డబుల్ మేజర్ డిగ్రీ విధానం అమలకు SVU పరిధిలో 90 శాతం కాలేజీలు వ్యతిరేకత చూపాయి. ఈ విధానానికి, మల్టి డిసిప్లినరీకి తేడా లేదని మేధావులు అభిప్రాయపడ్డారు. ఈ విధానానికి సౌకర్యాలు కల్పన కష్టమని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు తేల్చి చెప్పాయి. దీంతో హైయర్ ఎడ్యుకేషన్ త్వరలో సింగిల్ మేజర్ సబ్జెక్ట్ విధానాన్ని కొనసాగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం.

News July 7, 2025

కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించిన గవర్నర్

image

హనుమకొండ కలెక్టరేట్లో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంపై హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల్లో టీబీ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు కలెక్టర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.