News September 5, 2025
HYD: ‘NIRF ర్యాంక్..OU UPDATE!

✒జాతీయస్థాయిలో 53వ స్థానంలో నిలిచింది✒2024లో 73వ స్థానం నుంచి ఏడాదిలోనే 17 స్థానాలు ఎగబాకింది✒విశ్వవిద్యాలయాల విభాగంలో 2024లో ఉన్న 43వ స్థానం నుంచి 13స్థానాలు మెరుగుపరుచుకుని 30వ ర్యాంకు సాధించింది.✒వర్సిటీ హెచ్ ఇండెక్స్ 121కి చేరింది.✒రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని విశ్వవిద్యాలయాల విభాగంలో దేశంలో ఓయూ 7వ స్థానంలో నిలిచింది.✒సైటేషన్లు 15,000 నుంచి 90,000కు పెరిగాయన్నారు
Similar News
News September 5, 2025
HYD పరువు తీస్తున్నారు.. మీరు మారరా?

వినాయకచవితి పండుగ నగర యువతకు ఒక ఎమోషన్. ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొనే వేడుక ఇది. కానీ, కొందరు పరువు తీస్తున్నారు. ఖైరతాబాద్‌కు దర్శనానికి వచ్చిన అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించి 930 మంది పట్టుబడ్డారు. మరికొందరు మద్యం తాగి జులూస్‌లకు వస్తున్నారు. భక్తిపాటలకు బదులు తమకు నచ్చిన పాటలతో చిందులేసిన వీడియోలు SMలో వైరల్ అయ్యాయి. ఇకనైనా వీటికి స్వస్థి పలికి భక్తితో నిమజ్జనం చేద్దాం. దీనిపై మీ కామెంట్?
News September 5, 2025
HYD: SBI రివార్డ్ పాయింట్ల పేరిట మోసం..జాగ్రత్త!

SBI రివార్డు పాయింట్ల తేదీ గడిచిపోతుందని, వాటిని నగదుగా మార్చుకోవాలంటే వెంటనే APK ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవాలని వాట్సప్, ఫేస్‌బుక్, మెసేజెస్ ద్వారా వచ్చే సమాచారాన్ని నమ్మొద్దని పోలీసులు సూచించారు. APK డౌన్‌లోడ్ చేసుకున్న అనంతరం వ్యక్తిగత వివరాలు తీసుకునే ప్రమాదం ఉందన్నారు. SBI బ్యాంకు అలాంటిది ఏది వాట్సాప్ ద్వారా పంపదని ఉప్పల్ SBI ప్రశాంత్ నగర్ అధికారులు తెలిపారు.
News September 5, 2025
HYD: గణేశ్ నిమజ్జనం కోసం.. ఆన్ డ్యూటీలో అన్ని శాఖలు!

హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గణపతి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు మంత్రి ప్రభాకర్ తెలిపారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, HMDA, వాటర్ బోర్డు, ట్రాఫిక్ పోలీస్, R&B, హైడ్రా, మెడికల్ & హెల్త్, టూరిజం & ఇన్ఫర్మేషన్ విభాగాలు ఆన్ డ్యూటీలో ఉన్నట్లు చెప్పారు. GHMC సెప్టెంబర్ 6న విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.