News April 12, 2025

HYD: NRSCతో హైడ్రా ఒప్పందం

image

NRSCతో హైడ్రా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు, నాలాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఉపగ్రహ చిత్రాలు, ఇతరాత్ర భూ వివరాలను ఉపయోగించుకొని చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం తదితర వాటికోసం NRSCతో MOU కుదుర్చుకుంది. ఈ మేరకు శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాలు చేశారు.

Similar News

News April 22, 2025

తాళ్లపూడి: పుష్కరాల రేవులో శిశువు మృతదేహం లభ్యం

image

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి పుష్కరాల స్నాన ఘట్టానికి వెళ్లే మార్గంలో ఆడ శిశువు మృతదేహాన్ని మంగళవారం స్థానికులు కనుగొన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొవ్వూరు సీఐ విజయబాబు ప్రాంతాన్ని సందర్శించి శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆడ శిశువు మృతదేహం లభ్యమవ్వడంతో చుట్టుపక్కల ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులలో పోలీసులు విచారణ చేపట్టారు.

News April 22, 2025

కడప జిల్లాలో ఎస్ఐల బదిలీ

image

కడప జిల్లా వ్యాప్తంగా పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రతిపాదనల మేరకు 10 మందికి స్థానచలనం కల్పించారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేసుకోవాలని సూచించారు. 

News April 22, 2025

అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ దరఖాస్తుల గడువు పొడిగింపు

image

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ దరఖాస్తుల గడువు ఈనెల 25 వరకు పొడిగించినట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి మంగళవారం పేర్కొన్నారు. భారత రక్షణ శాఖ వివిధ దళాల రిక్రూట్మెంట్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన అగ్ని పథకంలో భాగంగా ఆర్మీలో ఉద్యోగాల ప్రకటన జారీ అయినదని అన్నారు. మధ్యవర్తుల మాటలు నమ్మవద్దని కేవలం ప్రతిభ, మార్కుల ఆధారంగానే నియామకాలు జరుగుతాయన్నారు.

error: Content is protected !!