News April 11, 2024
HYD: OFFER ఆరు నెలల వరకే.. సెలవుల లిస్ట్ ఎక్కడ?

HYD మెట్రో సంస్థ సూపర్ సేవర్ హాలిడే కార్డు, పీక్ హవర్ డిస్కౌంట్ కార్డు, స్టూడెంట్ మెట్రోపాస్ కార్డును ఏప్రిల్ 9న రీ లాంచ్ చేసినట్లుగా తెలిపింది. ఏప్రిల్ 9 నుంచి 6 నెలల వరకే ఆఫర్లు వర్తిస్తాయని పేర్కొన్నారు. అయితే, ఏప్రిల్ నెల నుంచి మరో ఆరు నెలల వరకు హాలిడేల లిస్ట్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. వెంటనే హాలిడేస్ లిస్ట్ విడుదల చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Similar News
News February 9, 2026
బంజారాహిల్స్‌లో నిలోఫర్ కొత్త వెజ్ హబ్ ప్రారంభం

హైదరాబాద్‌లో విశ్వసనీయ ఆహార బ్రాండ్ నిలోఫర్ బంజారాహిల్స్‌లో తన కొత్త రూఫ్‌టాప్ వెజిటేరియన్ రెస్టారెంట్ Niloufer Chathను ప్రారంభించింది. నార్త్ ఇండియన్ వెజ్ రుచులు, ఆధునిక డిజైన్, ప్రీమియం అంబియెన్స్‌తో ప్రత్యేక అనుభూతిని అందిస్తోంది. నాణ్యత, నమ్మకమే తమ లక్ష్యమని ఛైర్మన్ అనుముల బాబు రావు, MD శశాంక్ తెలిపారు. MLA దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొని ప్రశంసించారు.
News February 9, 2026
BREAKING: HYDలోని హాస్టళ్లలో తనిఖీలు

నగరంలోని PG హాస్టళ్లపై పోలీసుల నిఘా మొదలైంది. ‘ఇకపై ఆటలు సాగవు.. నిబంధనలు పాటించాల్సిందే’ అంటూ మియాపూర్ పోలీసులు నిర్వాహకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ట్రేడ్ లైసెన్స్, ఫైర్ ఎన్వోసీ, ఎఫ్ఎస్‌ఎస్ఏఐ సర్టిఫికెట్లు లేకపోతే కఠిన చర్యలు తప్పవని ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్ హెచ్చరించారు. ప్రతి హాస్టల్ సెక్టార్ వారీగా రిజిస్టర్లు మెయింటైన్ చేయాలని, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేయాలని ఆదేశించారు.
News February 9, 2026
హైదరాబాద్: తిండి కంటే ఫొటోలకే క్రేజ్!

హైదరాబాద్ పోరగాళ్లది మామూలు రచ్చ కాదు. ఇప్పుడు తిండి రుచి కంటే కూడా అది కెమెరాలో ఎట్లా కనిపిస్తుందనేదే ముఖ్యం. నియాన్ లైట్ల కొరియన్ ఫుడ్ దగ్గర మొదలుపెట్టి, మంటలు పుట్టించే ఫైర్ నూడుల్స్ దాకా అన్నీ రీల్స్ కోసమే. ప్లేటులో చీజ్ ఊగినా, పొగలు కక్కినా అదో వైరల్ సెన్సేషన్. కడుపు నిండడం సంగతేమో కానీ వీడియో క్రేజీగా రాకపోతే వీళ్లకు ఆ క్యాలరీలు దండగన్నమాట. డ్రామా ఉంటేనే మన జెన్-జీకి అసలైన దావత్.


