News August 12, 2024

HYD: ORRపై వాహనదారుల ఇష్టారాజ్యం

image

ఔటర్ రింగ్ రోడ్‌లో వాహనదారులు ఇష్టానుసారంగా ఔటర్ రింగ్ రోడ్డు 1, 2 లేన్లలోనే కాకుండా, రాంగూట్‌లోనూ రాకపోకలు సాగిస్తున్నారు. లీజుకు తీసుకున్న ఏజెన్సీ నిర్లక్ష్యంతో ఔటర్‌పై భద్రత ప్రశ్నార్థకంగా మారింది. వాహనాలు 190 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించేందుకు అవకాశం కల్పించినా మొదటి, 2 లేన్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వాహనాలను పర్యవేక్షించే పెట్రోలింగ్ వాహనాలు లేక పర్యవేక్షణ కొరవడింది.

Similar News

News September 11, 2024

HYD: శ్రీమహా విష్ణువుతో వినాయకుడి పాచికలు

image

సికింద్రాబాద్(లష్కర్)లో వివిధ రకాల గణపతులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కలాసిగూడలో శ్రీలక్ష్మీ గణపతి అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణేశుడు వెరైటీగా ఉండి, భక్తుల నుంచి విశేష పూజలు అందుకుంటున్నాడు. శ్రీమహావిష్ణువుతో కూర్చొని పాచికలు ఆడుతున్నట్లుగా ఏర్పాటు చేసిన విగ్రహాల సెట్టింగ్ భక్తులను ఆకట్టుకుంటోంది. 108 రకాల స్వీట్లను తయారు చేసి, గణేశుడికి నైవేద్యంగా పెట్టారు.

News September 11, 2024

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రోడ్లు విస్తరించాలని సీఎంకు కిషన్ రెడ్డి లేఖ

image

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి రైల్వే టర్మినల్‌కు వెళ్లే రోడ్లను విస్తరించాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి సోమవారం బహిరంగ లేఖ రాశారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లిలో రూ.415 కోట్లతో కొత్త రైల్వే టర్మినల్ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నామన్నారు.

News September 11, 2024

HYD: రూ.10,500 కోట్లు కేటాయించాలి: మేయర్

image

16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియా అధ్యక్షతన ప్రజా భవన్లో సోమవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో GHMC మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల కోసం 16వ ఆర్థిక సంఘం నుంచి రూ.10,500 కోట్లు కేటాయించాలని అభ్యర్థించినట్లు చెప్పారు.