News September 12, 2025

HYD: ORR పరిధిలో 39 STPలు

image

HYD ORR పరిధి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో ప్రభుత్వం అమృత్- 2.0 పథకంలో భాగంగా రూ.3,849.10 కోట్లతో మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణానికి పరిపాలనా అనుమతి ఇచ్చిందని జలమండలి పేర్కొంది. ప్యాకేజీ- 2 కింద మొత్తం 39 మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నారు. మొత్తం సామర్థ్యం 972MLD కాగా.. వ్యయం రూ.3,849.10 కోట్లు కానున్నట్టుగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.

Similar News

News March 10, 2026

మెదక్: పోలీసుల కళ్లుగప్పి.. పడవలో ట్యాంక్ బండ్‌కు..!

image

15ఏళ్ల క్రితం మిలియన్ మార్చ్ వేళ ట్యాంక్‌ బండ్ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. ఉద్యమాన్ని అడ్డుకోవాలని ఆందోళనకారులు నెక్లెస్ రోడ్డుకు రాకుండా పోలీసులు నలుదిక్కులా మోహరించారు. అడుగడుగునా ఆంక్షలు, అడ్డంకులు, అరెస్టులతో నిలువరించారు. దీంతో అప్పట్లో ఈ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ పరిస్థితుల్లో ఉద్యమనేత హరీశ్‌రావు హుస్సేన్‌సాగర్‌లో పడవలో ప్రయాణించి ట్యాంక్‌ బండ్‌కు చేరుకొని ఉద్యమానికి మద్దతు తెలిపారు.

News March 10, 2026

అక్రిలిక్ నెయిల్స్‌తో క్యాన్సర్ ముప్పు

image

చేతులు అందంగా కనిపించాలని కొందరు అమ్మాయిలు అక్రిలిక్ నెయిల్స్ పెట్టించుకుంటారు. అయితే వీటిని డ్రై చేయడానికి వాడే ల్యాంపులు UVA కిరణాలను విడుదల చేస్తాయి. ఇవి DNAకి హాని కలిగించి చర్మ క్యాన్సర్‌కు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే నెయిల్ సెలూన్‌కి వెళ్లినపుడు సన్‌స్క్రీన్/ UV ప్రొటెక్టెడ్ గ్లౌజెస్ వాడటం, LED ల్యాంపులు (UV కాకుండా) ఉపయోగించే సలూన్‌లను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News March 10, 2026

ట్యాంక్ బండ్ మిలియన్ మార్చ్‌లో నల్గొండ స్ఫూర్తి

image

తెలంగాణ మలిదశ ఉద్యమంలో మైలురాయిగా నిలిచిన ట్యాంక్ బండ్ మిలియన్ మార్చ్ జరిగి నేటికి (మార్చి 10) సరిగ్గా 15 ఏళ్లు. 2011లో జరిగిన ఈ చరిత్రాత్మక పోరాటంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించింది. ఆంక్షలు, అరెస్టులను దాటుకుని జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివెళ్లిన ఉద్యమకారులు, విద్యార్థులు హైదరాబాద్‌ను తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ఉద్యమంలో మీరూ పార్టిసిపేట్ చేశారా.. కామెంట్ చేయండి.