News April 30, 2024

HYD: ORR బయట శాటిలైట్ టౌన్ షిప్స్!

image

HYD నగరం ORR బయట శాటిలైట్ టౌన్ షిప్స్ నిర్మాణం పై HMDA కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రెండు ప్రాజెక్టులకు సంబంధించి దరఖాస్తులను HMDA స్వీకరించింది. RR జిల్లా దామర్లపల్లి-533 ఎకరాలు, నందిగామ పరిధి చేగురులో 100 ఎకరాల్లో షిప్స్ నిర్మాణానికి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను ఎన్నికల అనంతరం వేగవంతం చేయనున్నారు.

Similar News

News September 12, 2025

HYD: పార్టీ మారిన MLAలపై KTR కామెంట్స్

image

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ కామెంట్స్ చేశారు. పార్టీ మార్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేను రాహుల్ గాంధీతో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు స్వయంగా కలిశారని గుర్తు చేశారు. వారితో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో చూపించి, ఇవ్వాళ వీళ్లను మీరు గుర్తుపట్టగలరా? అని ఎద్దేవా చేశారు. BRS టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌లో చేరలేదు అంటున్నారన్నారు.

News September 12, 2025

HYD: గ్రూప్-1పై BJP మౌనమేల: కేటీఆర్

image

సీఎం రేవంత్ రెడ్డి, BJP మ‌ధ్య ర‌హ‌స్య మైత్రి కొన‌సాగుతుందని కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో నిప్పులు మండిపడ్డారు. చోటే భాయ్‌కి చీమ కూడా కుట్టకుండా బ‌డే భాయ్ పార్టీ బీజేపీ ప‌హారా కాస్తుంద‌ని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఎన్ని సమస్యలొచ్చినా.. రేవంత్ ఎన్ని స్కాములకు పాల్పడినా, బీజేపీ మాత్రం నొరుమెదపదెందుకు అని అన్నారు.

News September 12, 2025

HYD: ORR పరిధిలో 39 STPలు

image

HYD ORR పరిధి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో ప్రభుత్వం అమృత్- 2.0 పథకంలో భాగంగా రూ.3,849.10 కోట్లతో మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణానికి పరిపాలనా అనుమతి ఇచ్చిందని జలమండలి పేర్కొంది. ప్యాకేజీ- 2 కింద మొత్తం 39 మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నారు. మొత్తం సామర్థ్యం 972MLD కాగా.. వ్యయం రూ.3,849.10 కోట్లు కానున్నట్టుగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.