News August 17, 2025
HYD: OUలో 84వ స్నాతకోత్సవం..121 గోల్డ్ మెడల్స్ ప్రదానం

ఓయూ 84వ స్నాతకోత్సవం ఈనెల 19న ఉదయం 10:00 గంటలకు ప్రారంభం కానుంది. ఈ స్నాతకోత్సవంలో
✒121 బంగారు పతకాలు
✒పీహెచ్డీ పూర్తి చేసిన 1261 మంది విద్యార్థులకు పట్టాలు
✒108 ఏళ్ల OU చరిత్రలో మొట్ట మొదటి సారిగా గౌరవ కులపతి, రాష్ట్ర గవర్నర్ పేరుతో గిరిజన విద్యార్థులకు ఆంగ్లంలో పీహెచ్డీ డిగ్రీకి బంగారు పతకం
✒ఈ ఏడాది నుంచి ఎంబీఏ ఫైనాన్స్‌లో ప్రొఫెసర్ సముద్రాల సత్యనారాయణ మూర్తి స్మారక బంగారు పతకం అందిస్తున్నారు.
Similar News
News August 18, 2025
భార్యాభర్తల గొడవ.. నీల్వాయి SI సస్పెండ్

వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ SI సురేశ్ సస్పెండ్ అయ్యారు. CP అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు విడుదల చేశారు. సంపుటం గ్రామానికి చెందిన భార్యాభర్తల గొడవ విషయంలో కౌన్సెలింగ్ పేరిట స్టేషన్‌కు పిలిపించారు. తనను SI చితకబాదారని భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు SI సురేశ్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. గత నెల 19న వీధుల్లో చేరి నెల రోజులు గడవకముందే సస్పెండ్ అయ్యారు.
News August 18, 2025
వరంగల్: ప్రియుడితో కలిసి వెళ్తుంటే పోలీసులకు దొరికి..?

ప్రియుడితో కలిసి వెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డ ఘటన వరంగల్‌లో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. పద్మ అనే మహిళ చిట్టీలను నడుపుతూ జమ్మికుంటకు చెందిన సందీప్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. వీరి వివాహేతర సంబంధానికి పద్మ భర్త రాజు అడ్డుతొలగాలని ఈనెల 14న తన స్నేహితులతో రామన్నపేట డంపింగ్ యార్డులో గొంతు నులిమి హత్యాయత్నానికి పాల్పడ్డారు. రూ.9లక్షలతో వెళ్తుండగా పట్టుబడ్డారు.
News August 18, 2025
నాగల్‌గిద్ద: పెన్షన్ కోసం ఎదురు చూపు

నాగల్‌గిద్ద మండలంలోని శేరిధామస్‌గిద్దకు చెందిన తుర్రురాజు మూడేళ్ల నుంచి నడవలేని స్థితిలో ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం కాలుకి గాయం కావడంతో వైద్యులు అతని రెండు కళ్లు తొడ వరకు తొలగించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పెన్షన్ కోసం ఎన్ని సార్లు సదరం క్యాంప్‌నకు వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వేడుకుంటున్నాడు. అధికారులు స్పందించి పెన్షన్ మంజురు చేయాలని బాధితుడు కోరుతున్నాడు.