News January 19, 2025
HYD: OYO బంద్ చేయాలని డిమాండ్

OYO హోటల్స్ బంద్ చేయాలని HYD శివారులో ఆందోళన చేపట్టారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఓయో హోటల్లో మైనర్ బాలికపై అత్యాచారం, మంగళపల్లిలోని ఓ హాస్టల్లో ఉన్న విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ CPI నిరసన వ్యక్తం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు యాదయ్య అత్యాచారం జరిగిన OYO ముందు ధర్నా చేపట్టారు. ప్రధాన నిందితుడు, హోటల్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 14, 2025
జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్.. BRS మరింత అప్రమత్తం!

ఈరోజు జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్‌కు BRS అధిష్ఠానం మరింత అప్రమత్తమైంది. పాలకులు తప్పుదారి పట్టిస్తారేమోనని అనుమానం వచ్చి HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌కు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లను రంగంలోకి దించింది. ఎర్రోళ్ల శ్రీనివాస్, చిరుమర్తి లింగయ్య,క్రాంతి కిరణ్, గండ్ర వెంకట రమణారెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులను కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించి కౌంటింగ్‌లో జరిగే తప్పులను గట్టిగా నిలదీసేలా ప్లాన్ చేసింది.
News November 14, 2025
జూబ్లీహిల్స్ బై పోల్: అనుమానం వచ్చి ఫిర్యాదు చేస్తేనే VVPAT లెక్కింపు

మనం ఓటు వేసినపుడు ఓ స్లిప్ మనం ఎవరికి ఓటు వేశామో మనకు చూపించి ఆ తరువాత ఒక డబ్బాలో పడిపోతుంది. దానినే VVPAT అంటారు. ఆ స్లిప్పులను కౌంటింగ్ సమయంలో లెక్కించరు. అయితే పోలింగ్ శాతానికి, ఓట్లకూ లెక్క సరిపోవాలి. అలా కానిపక్షంలో ఏజెంట్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తారు. అప్పుడు ఆర్ఓతోపాటు సూపర్ వైజర్ VVPAT (Voter Verifiable Paper Audit Trail) ఓట్లను లెక్కిస్తారు.
News November 14, 2025
జూబ్లీబైపోల్: పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్‌కు 47 ఓట్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగిసింది. పోస్టల్ బ్యాలెట్లో మొత్తం 101 మంది హోం ఓటింగ్ వేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 47 మంది ఓటేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 43 ఓట్లు పడ్డాయి. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 11 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం మొదటి రౌండ్లో భాగంగా షేక్‌పేట బూత్‌ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.


