News March 17, 2024
HYD: ప్రధాని పర్యటన.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు
HYD నగరంలో ఈ నెల 17, 18న ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర అదనపు పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. PM ఈ నెల 17న బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్ వెళ్లనున్న నేపథ్యంలో రాత్రి 7.40 నుంచి 8.10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 18న PM రాజ్‌భవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు. దీంతో ఉదయం 9.50 నుంచి 10.20 గంటలకు వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.
Similar News
News November 24, 2024
HYD: మహిళకు SI వేధింపులు..!
HYDలోని ఓ SI వేధిస్తున్నారని గృహిణి సీపీ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ప్రకారం.. ‘నా భర్త వేధింపులు తాళలేక PSలో ఫిర్యాదు చేశాను. అందులోని నా మొబైల్ నంబర్ తీసుకుని SI పర్సనల్ మెసేజులు చేస్తూ వేధిస్తున్నారు’ అని వాపోయారు. ‘నీ కేసు నేను పరిష్కరిస్తా.. మీ ఇంటికి వస్తా’ అంటూ అసభ్యంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.
News November 24, 2024
HYD: 15 ఏళ్లు దాటితే సీజ్ చేయండి: మంత్రి
15 ఏళ్లు దాటిన స్కూల్ బస్సులను వెంటనే సీజ్ చేయాలని ఖైరతాబాద్‌లో జరిగిన మీటింగ్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. స్కూల్ బస్సుల తనిఖీల్లో భాగంగా ఫిట్నెస్, ఇన్స్యూరెన్స్, RC సహా అన్ని పత్రాలు చెక్ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 వేల స్కూల్ బస్సులపై నివేదిక ఇవ్వాలన్నారు. 62 రవాణా శాఖ కార్యాలయాల్లో ఉద్యోగుల పనితీరు, మౌలిక వసతులపై నివేదిక సిద్ధం చేయాలన్నారు.
News November 24, 2024
HYD: మెనూ పాటించకపోతే చర్యలు: కలెక్టర్
HYD జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలలకు కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం ఫుడ్ మెనూ పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని, లేదంటే టీచర్లపైనా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులను ఆయా హెచ్ఎంలు ఎప్పటికప్పుడు మెరుగుపరచాలన్నారు.