News July 15, 2024
HYD: PSలో హోంగార్డు హల్చల్

‘నా కొడుకునే రిమాండ్ చేస్తారా మీకెంత ధైర్యం ఉండాలి’ అంటూ ఓ హోంగార్డు PSలో హల్చల్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఘట్కేసర్కు చెందిన ఏ.వెంకటేశ్‌ను చైన్‌స్నాచింగ్ కేసులో పోలీసులు రిమాండ్ చేశారు. నిందితుడి తండ్రి హోంగార్డుగా పని చేస్తున్నారు. శనివారం రాత్రి స్థానిక PSలోకి వెళ్లి ఏకంగా క్రైమ్ సీఐ శ్రీనివాస్‌నే ‘నీ అంతు చూస్తా’ అంటూ ఇష్టమొచ్చినట్లు తిడుతూ రచ్చచేశారు. అతడి మీద కూడా కేసు నమోదైంది.
Similar News
News November 14, 2025
హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల వన్ టైం చాన్స్ పరీక్షా తేదీల ఖరారు

ఓయూ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) వన్ టైం చాన్స్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సుల అన్ని సెమిస్టర్ల వన్ టైం చాన్స్ బ్యాక్ లాగ్ పరీక్షలను ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబసైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
News November 14, 2025
HYD: 3ఏళ్లకే రికార్డులు కొల్లగొడుతున్న కార్తీక్ సూర్య

వనస్థలిపురంలోని IT ఉద్యోగి ప్రశాంత్, నీరజ కొడుకు కార్తీక్ సూర్య(3)కు 16 నెలల వరకు మాటే రాలే. 3 ఏళ్ల వయసులో అంకెలు గుర్తించి తల్లిని అడిగి తెలుసుకునేవాడు. వారి పెంపకంలో రోజుల వ్యవధిలోనే పెద్ద అంకెలతో కూడిక, తీసివేత, శాతాలు చేయడం మొదలెట్టాడు. కఠిన పదాలకు క్షణాల్లో నోటితోనే కచ్చితమైన సమాధానం చెప్తాడు. ఇండియా, నోబుల్, కిడ్స్, తెలంగాణ, తెలుగు, వరల్డ్ వైడ్, కలాం వరల్డ్ రికార్డులు సొంతం చేసుకున్నాడు.
News November 14, 2025
గచ్చిబౌలి స్టేడియంలో రెజోఫెస్ట్ 2025

రెజోనెన్స్ నిర్వహించిన రెజోఫెస్ట్ 2025 గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. 35 క్యాంపస్‌లకు చెందిన 7,000+ విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. డా. జైతీర్థ్ ఆర్. జోషి, నాగ్ అశ్విన్, శర్వానంద్, సుమా కనకాల వంటి ప్రముఖులు హాజరై విద్యార్థులకు స్ఫూర్తి, సృజనాత్మకత, లక్ష్య సాధన గురుంచి వివరించారు.


