News March 18, 2024
HYD: మూడేళ్ల చిన్నారిపై బాలుడి అత్యాచారం

మూడేళ్ల చిన్నారిపై 13ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన HYD సరూర్నగర్ PSపరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పవనపురి కాలనీలో పక్క పక్క పోర్షన్లలో 2కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. ఆదివారం సాయంత్రం ఓ కుటుంబానికి చెందిన చిన్నారి దాబాపై ఆడుకుంటోంది. అదే సమయంలో మరో కుటుంబానికి చెందిన బాలుడు వెళ్లి చిన్నారిపై అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News December 8, 2025
సీఎం సరికొత్త ఆలోచన.. HYDలో డొనాల్డ్ ట్రంప్ రోడ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ఇపుడు హైదరాబాద్లోని ఓ రోడ్డుకు పెట్టనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సిటీలోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ వద్ద ఉన్న రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని నామకరణం చేయాలని సర్కారు నిర్ణయించింది. అయితే ఇది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ విషయాన్ని కేంద్రానికి, యూఎస్ ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ లేఖ రాయనున్నట్లు సమాచారం.
News December 8, 2025
HYDలో అక్కడ ఒక్క రూపాయికే టిఫిన్

HYDలోని రైల్వే స్టేషన్ పరిసరాల్లో భోజనం కోసం బిక్కు బిక్కుమంటూ తిరిగే వాళ్లెందరో. అలాంటి వారిని చూసి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ‘కరుణ కిచెన్’ జార్జ్ రాకేశ్బాబు రూపాయికే టిఫిన్ పెడుతున్నట్లు తెలిపారు. రోజూ మెనూ ఛేంజ్ చేస్తూ దాదాపు 300 మంది కడుపు నింపుతున్నారు. ఉ.7 గం.- 9 గం. వరకు 2 గంటలు కొనసాగుతోంది. ‘డబ్బు కోసం కాదు.. నలుగురి కడుపు నింపేందుకు. ఇందులోనే నా సంతోషం ఉంది’ అని తెలిపారు.
News December 8, 2025
ప్రపంచాన్ని ఏకం చేసేలా HYDలో సమ్మిట్

HYD శివారు మీర్ఖాన్పేట్ గ్లోబల్ సమ్మిట్కు వేదికైంది. 44కిపైగా దేశాలు, 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, గ్లోబల్ కంపెనీలు పాల్గొననున్న ఈ సమ్మిట్ మ.1:30కు ప్రారంభం కానుంది. నోబెల్ గ్రహీతలు అభిజిత్, కైలాష్ సత్యర్థి ప్రధాన వక్తలు. వీరిలో 46 మంది అమెరికా ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, అమెజాన్, ఐకియా తదితర ప్రతినిధులు ఉన్నారు. అంతేకాదు ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ కంపెనీలు, ఇతర దేశాల రాయబారులు రానున్నారు.


