News April 12, 2024
HYD: RRR గ్రీన్ బెల్ట్.. 110 జోన్లుగా అభివృద్ధి?

HYD శివారు RRR ప్రతిపాదిత గ్రీన్ బెల్ట్ ద్వారా అందుబాటులోకి వచ్చే 1.10 లక్షల ఎకరాల భూముల్లో చెరువులు, ఆక్వాకల్చర్, అగ్రి బిజినెస్ వ్యాపారాలు చేపట్టవచ్చని, దీనికి సంబంధించి JNTU ఆచార్యులు కే.లక్ష్మణరావు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం 110 గ్రీన్ జోన్లుగా విభజిస్తే సాధ్యమవుతుందని, ఒక్కో జోన్‌లో 1000 ఎకరాల్లో 200-400 ఎకరాల చెరువులు, మిగతా 600 ఎకరాల్లో అగ్రి బిజినెస్ చేయొచ్చని తెలిపారు.
Similar News
News March 17, 2025
OUలో పీహెచ్‌డీ ప్రవేశాలకు గడువు పొడిగింపు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ఫ్యాకల్టీల కేటగిరి 2 పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసేందుకు గడువును పొడిగించినట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. రూ. 2000 అపరాధ రుసుంతో ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ప్రవేశ పరీక్షలు వచ్చేనెల 25 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.
News March 17, 2025
కాచిగూడ: ‘దేశ జనాభా గణనలో కులగణన చేపట్టాలి’

దేశ జనాభా గణనలో కులగణన చేపట్టాలని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడలో రోడ్డుపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో బీసీలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. దేశ జనాభాలో 60శాతనికి పైగా ఉన్న బీసీలకు 27 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయన్నారు.
News March 17, 2025
భూభారతి చట్టంలోనూ అనేక లోపాలు: మల్లారెడ్డి

ధరణిలో లోపాలు పరిష్కరించకుండానే రద్దుచేసి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చారని ఈ చట్టంలోకూడా లోపాలు ఉన్నాయని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణలో భూచట్టాలు పరిణామ క్రమం – ధరణి – భూభారతి చట్టాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. భూ సమస్యలు పరిష్కరించకుండా సంవత్సరాల తరబడి కొనసాగిస్తున్న దుస్థితి ఉందన్నారు.