News October 16, 2024
HYD: RRR ప్రాజెక్ట్.. 1,712 KM రేడియల్ రోడ్లు

HYD నగరానికి ORR నుంచి RRR కలుపుతూ రేడియల్ రోడ్ల నిర్మాణం జరగనుంది. రేడియల్ రోడ్ల ద్వారా ప్రయాణ సదుపాయం మరింత మెరుగుపడటమే గాక.. ట్రాఫిక్ సమస్య సైతం తగ్గుతుందని ఇంజినీరింగ్ యంత్రాంగం భావించింది. వివిధ దశల్లో ఈ నిర్మాణం పూర్తి కానుంది. రేడియల్ రోడ్ల నిర్మాణం పూర్తయితే మొత్తం 1,712KM మేర 60 రోడ్లు అందుబాటులోకి రానున్నాయి.
Similar News
News November 18, 2025
సికింద్రాబాద్ MRO ఆఫీసులో ఏసీబీ సోదాలు

సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా సర్వేయర్ కిరణ్ పట్టుబడ్డాడు. ఎమ్మార్వో కార్యాలయంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సర్వేయర్ కిరణ్‌తో పాటు చిన్న మెన్ భాస్కర్లను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
News November 18, 2025
సాంఘిక దురాచారాలపై పోరాటం అవసరం: చిన్నారెడ్డి

శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్న ఈ ఆధునిక కాలంలోనూ దళితులు, గిరిజనులు, మహిళల పట్ల వివక్ష కొనసాగడం బాధాకరమని సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జి జి. చిన్నారెడ్డి అన్నారు. సాంఘిక దురాచారాలపై ప్రతి ఒక్కరూ సంఘటితంగా పోరాడాల్సిన బాధ్యత ఉందన్నారు. మంగళవారం ప్రజా భవన్‌లో సీఎం ప్రజావాణి, దళిత స్త్రీ శక్తి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన లీగల్ క్లినిక్ ప్రత్యేక కార్యక్రమంలో చిన్నారెడ్డి మాట్లాడారు.
News November 18, 2025
HYD: జేఎన్టీయూలో వేడుకలు.. హాజరు కానున్న సీఎం

జేఎన్టీయూలో డైమండ్ జూబ్లీ, గ్లోబల్ అలుమ్నీ వేడుకలు 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 21, 22 తేదీల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అట్టహాసంగా జరిగే ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని ప్రిన్సిపల్ డా.భ్రమర తెలిపారు. 21న సీఎం రేవంత్ రెడ్డి, 22న మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరు అవుతారని పేర్కొన్నారు.


