News October 16, 2024
HYD: RRR ప్రాజెక్ట్.. 1712 KM రేడియల్ రోడ్లు
HYD నగరానికి ORR నుంచి RRR కలుపుతూ రేడియల్ రోడ్ల నిర్మాణం జరగనుంది. రేడియల్ రోడ్ల ద్వారా ప్రయాణ సదుపాయం మరింత మెరుగుపడటమే గాక.. ట్రాఫిక్ సమస్య సైతం తగ్గుతుందని ఇంజినీరింగ్ యంత్రాంగం భావించింది. వివిధ దశల్లో ఈ నిర్మాణం పూర్తి కానుంది. రేడియల్ రోడ్ల నిర్మాణం పూర్తయితే మొత్తం 1712KM మేర 60 రోడ్లు అందుబాటులోకి రానున్నాయి.
Similar News
News November 1, 2024
దీపావళి వేళ.. రికార్డు సృష్టించిన ఇండియన్ రైల్వేస్
దీపావళి,ఛత్ పండగల వేళ 7,296 స్పెషల్ రైళ్లను నడిపిస్తూ ఇండియన్ రైల్వేస్ రికార్డు సృష్టించింది.గత ఏడాది ఇండియన్ రైల్వేస్ 4500 స్పెషల్ ట్రైన్లు నడిపించగా, ఈ సారి ఏకంగా 7,296 స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు పేర్కొంది. ఇంకోవైపు SCR సౌత్ సెంట్రల్ రైల్వే గత ఏడాది 626 స్పెషల్ రైళ్లు నడపగా..ఈసారి రికార్డ్ స్థాయిలో 854 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు పేర్కొంది. ఇందుకు రద్దీ పెరగటమే కారణమంది.
News November 1, 2024
HYD: కల్తీ పాలను ఇలా గుర్తించండి..!
HYD నగరంలో కల్తీ మహమ్మారి ప్రజలను భయపెడుతోంది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ కమిషన్, FSSAI అధికారులు కల్తీ పాలను గుర్తించే విధానాన్ని వివరించారు.చల్లార్చిన పాలలో 2-3 చుక్కల అయోడిన్ టింక్చర్ కలపాలి. కాసేపటి తర్వాత పాలు నీలిరంగు కలర్‌లో మారితే కల్తీ జరిగినట్లని గుర్తించాలి. పన్నీర్ లాంటి ఇతర పాల ఉత్పత్తుల టెస్టింగ్లో 2-3ML శాంపిల్లో 5ML నీటిని కలిపి కాచి చల్లార్చి, 2-3 చుక్కల అయోడిన్ టింక్చర్ కలపాలన్నారు.
News November 1, 2024
సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్లు
సికింద్రాబాద్, HYD, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి దీపావళి పండుగ వేళ నేడు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో నేడు ఏకంగా 29 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. HYD-గోరఖ్ పూర్, HYD-జైపూర్,సికింద్రాబాద్-బెర్హంపూర్,కాచిగూడ-నాగర్ కోయిల్, సికింద్రాబాద్-పాట్నాకు ప్రత్యేక రైళ్లు ఉన్నాయని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.