News November 8, 2024
HYD: RRR సమాంతరంగా రింగ్ రైల్ సర్వే షురూ..!
RRR రహదారికి సమాంతరంగా రింగ్ రైల్ నిర్మాణానికి అడుగు ముందుకు పడింది. ఇందులో భాగంగా ఆర్బీ అసోసియేషన్ ఏజెన్సీ ప్రతినిధులు సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సర్వేకు కోడంగల్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. సుమారు 564 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టు రూపు దిద్దుకొనుందని, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, గజ్వేల్, భువనగిరి, యాదాద్రి, చిట్యాల నారాయణపూర్, షాద్‌నగర్, షాబాద్‌ను కలుపుతూ.. ఈ ప్రాజెక్టు ఉంటుందన్నారు.
Similar News
News December 6, 2024
HYD: తార్నాక ఆర్టీసీ ఆసుపత్రి ప్రత్యేకతలు ఇవే.!
HYD తార్నాకలోని రాష్ట్ర ఆర్టీసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉద్యోగులందరికీ ఆరోగ్య సేవలు అందిస్తోంది. రాష్ట్రంలో 15 డిస్పెన్సరీలు ఉన్నట్లు తెలిపింది. 24/7 ఫార్మా, ఫిజియోథెరపీ, ఐసీయూ, CT, MRI, ఆపరేషన్ థియేటర్, ల్యాబోరేటరీ, కాలేజీ, నర్సింగ్ ల్యాబ్, ఒకేషనల్ జూనియర్ కాలేజ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు కాకుండా మిగతా వారికి సైతం నామమాత్రపు ఫీజుతో OP సేవలు అందిస్తారు.
News December 6, 2024
HYD: పుష్ప2.. భార్యగా, తల్లిగా రేవతి GREAT
పుష్ప-2 ప్రీమియర్‌షోకు వెళ్లిన రేవతి కుటుంబంలో విషాదం మిగిలిన విషయం తెలిసిందే. తనకు 2023లో కాలేయం ఇచ్చి పునర్జన్మనిచ్చిన భార్య లేదనే బాధ కలచివేస్తుందని ఆమె భర్త భాస్కర్ కంటతడిపెట్టిన ఘటన పలువురిని కదిపేసింది. కుమారుడు బన్నీకి వీరాభిమాని అని, ఫస్ట్ షో చూపించమని మారాం చేయడంతో సంధ్య థియేటర్‌కు వెళ్లామని వాపోయారు. క్రౌడ్‌లో కింద పడిపోయిన బాలుడిని పైకిలేపే క్రమంలో తల్లి తీవ్రంగా గాయపడిందని వాపోయారు.
News December 6, 2024
HYD: అన్నింటా ఆరితేరారు.. వీరితో జాగ్రత్త..!
HYDలో సైబర్ మోసాలు, వ్యభిచార కార్యకలాపాలు, నకిలీ యాప్స్, డ్రగ్స్ రవాణా వంటి అనేక కేసుల్లో విదేశీయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గత మూడేళ్లలో డ్రగ్స్ సరఫరా కేసుల్లో దాదాపు 31 మంది ఉండటం గమనార్హం. ఇందులో 90% నైజీరియన్లే ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు. నకిలీ కార్డులను తయారీలోనూ విదేశీయులు ఆరితేరారు. సింగపూర్, కంబోడియా, థాయిలాండ్, చైనా దేశాల కేంద్రంగా సైబర్ మోసాలూ జరుగుతున్నాయి.