News September 18, 2024

HYD: RTC బస్సు ఢీకొని ఒకరి మృతి

image

RTC బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శంకర్‌పల్లి PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మున్సిపల్ పరిధి బుల్కాపూర్ వార్డు శివారులో గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. HYD నుంచి శంకర్‌పల్లి వైపు వస్తున్న RTC బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 23, 2025

మూడు కార్పొరేషన్లుగా మహానగరం..!

image

GHMCలో మున్సిపాలిటీల విలీనం అనంతరం మహానగరం 300 డివిజన్లకు పెరిగింది. అయితే ఇంత పెద్ద నగరానికి ఒకే కార్పొరేషన్ ఉండాలా లేక విభజించాలా అనే విషయాన్ని సర్కారు ఆలోచిస్తోంది. మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. గ్రేటర్‌ను 3 కార్పొరేషన్లుగా విభజించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.

News December 23, 2025

ఢిల్లీకి చేరువలో HYD పొల్యూషన్

image

HYDలో ఎయిర్ క్వాలిటీ ఢిల్లో పరిస్థితి దగ్గరలో ఉంది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో 300 ఉండగా.. నగరంలో డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ 270కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు తప్పనిసరిగా మాస్కులు ధరించడం మేలని, చిన్న పిల్లలను దీని నుంచి కాపాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News December 23, 2025

మంగళవారం బల్కంపేట ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు

image

బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం విశేష పూజలు చేశారు. అర్చకులు, వేద పండితులు అమ్మవారిని పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పుష్పాలతో అభిషేకించారు. మంగళవారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. క్యూ లైన్లలో వేచి ఉండి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.