News April 1, 2024

HYD: RTC ‘గమ్యం’ తెలిసేది సగమే..!

image

RTCబస్సు ఎక్కడ ఉందో.. ఎప్పుడొస్తుందో తెలుసుకునేందుకు ప్రవేశపెట్టిన ట్రాకింగ్ యాప్ ‘గమ్యం’ ప్రయాణికులకు అరకొరగానే ఉపయోగపడుతోందని అంటున్నారు. ఈయాప్‌ను ప్రారంభించి దాదాపు 8నెలలు అవుతోంది. సెల్ ఫోన్‌లో ‘గమ్యం’ యాప్ తెరిచి బస్సుల జాడ కోసం ప్రయత్నిస్తున్న వారికి పలు సందర్భాల్లో సమాచారం రావడం లేదంటున్నారు. సర్వీస్ రూట్ల వివరాలను నమోదు చేయడంలో పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Similar News

News April 23, 2025

HYD: MLC ఎన్నిక.. 112లో 88 మంది ఓటు

image

22 ఏళ్ల తర్వాత జరిగిన హైదరాబాద్ MLC కోటా ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు 112 ఓటర్లు ఉండగా మొత్తం 88 మంది ఓటు వేశారు. 24 మంది BRS ఓటర్లు మినహాయిస్తే MIM, కాంగ్రెస్, BJP సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 37.51%, మ. 12 గంటల వరకు 77.68%, మధ్యాహ్నం 78.57% ఓటింగ్ నమోదు అయ్యింది.

News April 23, 2025

2PM: HYDలో 78.57% పోలింగ్

image

HYD స్థానిక సంస్థల ఎలక్షన్ ఖైరతాబాద్ GHMC ప్రధాన కార్యాలయంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 78.57% పోలింగ్ జరిగిందని అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్, MIM, BJP సభ్యులు తమ ఓటును నమోదు చేసుకుంటున్నారు. KTR పిలుపు మేరకు గులాబి దళం నుంచి పోలింగ్‌‌లో ఎవరూ పాల్గొనలేదు. ఇప్పటివరకు దూరంగానే ఉంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుంది.

News April 23, 2025

HYD: యూనిట్లకు బిల్లు ఎలా నిర్ధారిస్తారంటే!

image

గ్రేటర్ HYDలో వేసవి వేళ కొందరికి కరెంట్ బిల్లులు వేలల్లో వస్తుండగా షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల వివరాలను హబ్సిగూడ అధికారులు తెలిపారు. జీరో నుంచి 50 యూనిట్లకు రూ.1.95, 50 నుంచి 100 యూనిట్లకు రూ.3.10, 101-200 యూనిట్లకు రూ.4.80, 201-300 యూనిట్లకు రూ.7.70 చొప్పున ఒక్కో యూనిట్‌పై ఇలా విద్యుత్ ఛార్జీ ఉంటుందని, లిమిట్ దాటితే యూనిట్ ఛార్జీ మారుతుందని తెలిపారు.

error: Content is protected !!