News February 17, 2026
HYD: RTC బస్సుల్లో ఆధార్ కార్డు లొల్లి..!

ఆర్టీసీ బస్సుల్లో ఒరిజినల్ ఆధార్ కార్డు అంశంపై తరచూ వివాదాలు జరుగుతున్నాయి. మహిళలు, కండక్టర్లు, టికెట్ ఇన్స్పెక్టర్లతో వాగ్వాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఆర్టీసీ MD సజ్జనార్ స్పష్టత ఇచ్చారు. ఆధార్ కార్డు మాత్రమే కాదు, పాన్ కార్డు, భారత ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు చూపించినా సరిపోతుందని గతంలో తెలిపారు.
Similar News
News February 18, 2026
HYD: రేపటి నుంచి నైట్ అంతా ఓపెన్!

తెలంగాణలో రంజాన్ సందర్భంగా షాపులు, ఎస్టాబ్లిష్‌మెంట్‌లకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు మినహాయింపులు అమలులో ఉంటాయి. ప్రతి రోజూ ఉదయం 5 గంటల వరకు(నైట్ బజార్) షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఇక చార్మినార్‌లో రేపటి నుంచి నైట్ బజార్ మొదలుకానుంది. ఇక 24/7 నగరవాసుల రాకపోకలతో పాతబస్తీ కళకళలాడనుంది.
News February 18, 2026
GHMCలో రోజుకు 7,800 టన్నుల చెత్త సేకరణ

GHMC పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై కమిషనర్ కర్ణన్ సమీక్షించారు. రోజూ నగరంలోనే దాదాపు 7,800 టన్నుల చెత్తను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం 4,500 స్వచ్ఛ ఆటోలు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నాయి. అదే సమయంలో 2,650 స్వయం సహాయక సంఘాలకు చెందిన 18,557 మంది కార్మికులు క్షేత్రస్థాయిలో నిరంతరం పని చేస్తున్నారని కమిషనర్ వివరించారు.
News February 18, 2026
జూపార్క్: ఇండియాలోనే కాస్ట్ లీ టికెట్ ధర!

జూ పార్కులో సాధారణ ఎంట్రీ ఫీజు కేవలం రూ.100 (పెద్దలకు) మాత్రమే ఉంది. కానీ, <<19174320>>ఈ అండర్<<>> వాటర్ టన్నెల్ నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్న పని. గుజరాత్ సైన్స్ సిటీలోని ఇలాంటి టన్నెల్ అక్వేరియం టికెట్ ధర ప్రస్తుతం రూ.200 పైన ఉంది. హైదరాబాద్‌లో దీనిని మరింత అత్యాధునికంగా నిర్మిస్తున్నందున నిర్వహణ ఖర్చుల దృష్ట్యా టికెట్ ధర రూ. 300 నుంచి రూ.500 వరకు ఉండే అవకాశం ఉందని అంతర్గత చర్చలు జరుగుతున్నాయి.


