News January 10, 2025
HYD: RTC స్పెషల్ బస్సులపై ఛార్జీల పెంపు
రేపటి నుంచి సంక్రాంతికి ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తెలిపింది. జనవరి 10, 11,12,19,20 తేదీల్లో స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వ జీవో 16 ప్రకారం 50% వరకు ఛార్జీల పెంపు అమలులో ఉంటుందని పేర్కొంది. HYDలో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.
Similar News
News January 10, 2025
HYD: RRR రాష్ట్రానికి వరం: మంత్రి
తెలంగాణ రాష్ట్రానికి RRR రమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 2017లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినప్పటికీ BRS ప్రభుత్వం 6 సంవత్సరాలు మొద్దు నిద్రపోయిందని విమర్శించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని, ప్రధాని దృష్టికి తీసుకెళ్లడంతో పనులపై వేగం పెరిగినట్లుగా తెలిపారు. RRR నిర్మాణంతో HYD రూపురేఖలు అద్భుతంగా మారుతాయని పేర్కొన్నారు.
News January 10, 2025
శిల్పారామంలో ఆకట్టుకుంటున్న హస్తకళ ఉత్పత్తులు
మాదాపూర్లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న గాంధీ శిల్ప బజార్, సంక్రాంతి సంబరాల సందర్భంగా.. డెవలప్మెంట్ అఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ కమిషనర్ ఏర్పాటు చేసిన హస్తకళ ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నిర్వాహకులు మట్టి బొమ్మలు, పాత్రలు, కొండపల్లి బొమ్మలు, గుజరాతి బ్యాగులు, పాలరాయి బొమ్మలు, వెదురు బుట్టలు, పెయింటింగ్స్ హస్తకళ ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. స్టాళ్ల వద్ద సందర్శకుల సందడి నెలకొంది.
News January 10, 2025
సికింద్రాబాద్: సంక్రాంతి ఫెస్టివల్.. స్పెషల్ క్యాంపెయిన్
సంక్రాంతి ఫెస్టివల్ పురస్కరించుకొని సికింద్రాబాద్ జేబీఎస్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో ఎండీ ఎన్విఎస్ రెడ్డి స్పెషల్ క్యాంపెయిన్ ప్రారంభించారు. 3 రోజులపాటు జరగనున్న ‘యువర్ టైం ఆన్ మై మెట్రో’ ప్రోగ్రాంలో సంక్రాంతి వేడుకలు ఉట్టిపడేలా తీర్చిదిద్దిన రైలుకు పచ్చ జెండా ఊపారు. రాష్ట్ర సాంస్కృతి, కళలు కంటి ముందు కనపడేలా మెట్రో క్యాంపెయిన్ జరుగునుంది.