News January 10, 2025
HYD: RTC స్పెషల్ బస్సులపై ఛార్జీల పెంపు
రేపటి నుంచి సంక్రాంతికి ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తెలిపింది. జనవరి 10, 11,12,19,20 తేదీల్లో స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వ జీవో 16 ప్రకారం 50% వరకు ఛార్జీల పెంపు అమలులో ఉంటుందని పేర్కొంది. HYDలో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.
Similar News
News January 10, 2025
HYD: సంక్రాంతి పండుగ సందర్భంగా రాచకొండ సీపీ సూచనలు
రాచకొండ CP సుధీర్ బాబు సూచనల మేరకు సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజల ఆస్తి రక్షణకు చిట్కాలను విడుదల చేశారు. ప్రజలు తమ విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలి. ఇంటిలో CC కెమెరాలు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, అలారమ్ వ్యవస్థలు అమర్చుకోవాలి. అల్మారాలు, లాకర్ల తాళాలు కనిపించని ప్రదేశాల్లో దాచాలి. ఇంట్లో కొన్ని లైట్లు ఆన్లో ఉంచడం ద్వారా దొంగతనాలను నివారించవచ్చని CP తెలిపారు.
News January 10, 2025
కోర్టుకు హాజరుకాని మంత్రి కొండా సురేఖ.. కేసు వాయిదా
మంత్రి కొండా సురేఖపై అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసును స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఈనెల 16కు వాయిదా వేశారు. ఇదివరకే విచారణ చేపట్టిన కోర్టు పిటిషనర్‌తో పాటు సాక్షుల వాగ్మూలం రికార్డు చేసి మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. అయితే మంత్రి ప్రభుత్వ కార్యకలాపాల కారణంగానే కోర్టుకు హాజరుకాలేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో విచారణను వాయిదా వేశారు.
News January 9, 2025
ఓయూలో ఏడుగురికి అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లుగా పదోన్నతి
ఉస్మానియా యూనివర్సిటీ పనిచేస్తున్న ఏడుగురు ఆఫీస్ సూపరింటెండెంట్లను అసిస్టెంట్ రిజిస్ట్రార్ (ఏఆర్)లుగా, ఒక ఏఆర్‌కు డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు వారికి ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం.కుమార్ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.