News April 1, 2024
HYD: RTC ‘గమ్యం’ తెలిసేది సగమే..!
RTCబస్సు ఎక్కడ ఉందో.. ఎప్పుడొస్తుందో తెలుసుకునేందుకు ప్రవేశపెట్టిన ట్రాకింగ్ యాప్ ‘గమ్యం’ ప్రయాణికులకు అరకొరగానే ఉపయోగపడుతోందని అంటున్నారు. ఈయాప్‌ను ప్రారంభించి దాదాపు 8నెలలు అవుతోంది. సెల్ ఫోన్లో ‘గమ్యం’ యాప్ తెరిచి బస్సుల జాడ కోసం ప్రయత్నిస్తున్న వారికి పలు సందర్భాల్లో సమాచారం రావడం లేదంటున్నారు. సర్వీస్ రూట్ల వివరాలను నమోదు చేయడంలో పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
Similar News
News February 1, 2025
HYD: రోల్ మోడల్‌గా తెలంగాణ
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సర్వేలో తెలంగాణ అనేక అంశాల్లో ఆదర్శంగా నిలిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి తెలంగాణ ఘనతను చాటింది. అనేక పథకాల అమలు, వినూత్న పథకాల అమలులో ముందుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.
News February 1, 2025
HYD: R&B ఛీప్ ఇంజినీర్లతో మంత్రి కోమటిరెడ్డి నివాసంలో సమావేశం
ఆర్ & బీ ఛీఫ్ ఇంజినీర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో సమావేశం నిర్వహించారు. అటవీ అనుమతులతో పెండింగ్‌లో ఉన్న రహదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. రహదారి, భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, పనుల్లో వేగం పెంచి ప్రగతి చూపిస్తేనే, మరిన్ని నిధులు సాధించవచ్చని అధికారాలకు మంత్రి దిశానిర్ధేశం చేశారు.
News February 1, 2025
HYD: TGSPDCL, TGNPDCLకు రూ.45,698 కోట్ల రాబడి
విద్యుత్ భారాలపై తెలంగాణ విద్యుత్ శాఖ తర్జన భర్జన పడుతుంది. గృహ జ్యోతి కింద ఉచిత విద్యుత్‌కు రూ.2,400 కోట్ల భారాలను మోస్తున్న విద్యుత్ శాఖ.. ఆ మేరకు ప్రభుత్వం నుంచి నిధులను సేకరించుకోవాల్సి ఉంది. ప్రస్తుత విద్యుత్ టారీఫ్తో ఎస్పీడీసీఎల్ సంస్థకు రూ.36,277 కోట్ల రాబడి వస్తుండగా.. అటు ఎన్పీడీసీఎల్కు రూ.9,421 కోట్ల రాబడి వస్తున్నట్లు సమాచారం. ఈ రెండు కలిపితే రూ.45,698 కోట్లు రాబడి వచ్చింది.